Sugandi Plant : ఈ మొక్క వేర్లలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు?
Sugandi Plant : సుగంధి మొక్క తెలుసా మీకు. దాన్నే సుగంధి పాల మొక్క అని కూడా పిలుస్తాం. ఈ మొక్క అడవిలో విరివిగా కనిపిస్తుంది. మన ఇంటి పేరట్లోనూ ఈ మొక్కను చూడొచ్చు. వీటిని ఆకురాల్చే మొక్కలు అని కూడా పిలుస్తారు. దీన్ని హెమిడెస్మస్ ఇండికస్ అని పిలుస్తారు. అయితే.. దీన్ని ప్రాంతాన్ని బట్టి ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. ఆయుర్వేదంలో ఈ మొక్కకు ఉన్న ప్రాధాన్యత మరే మొక్కకు ఉండదు. ప్రతి ఆయుర్వేద మందులో సుగంధి మొక్కను ఉపయోగిస్తారు. ఆంగ్లంలో దీన్ని ఫాల్స్ సర్సపరిల్లా అని పిలుస్తారు.

health benefits of sugandi pala mokka
చాలా వ్యాధుల నివారణ కోసం ఆయుర్వేద నిపుణులు ఈ మొక్కను మందుల తయారీలో ఉపయోగిస్తారు. సర్వ రోగ నివారిణి అనే పదం.. దీనికి కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఎన్నో ఔషధ విలువలు ఉన్న సుగంధి మొక్కల వేర్లను ఆయుర్వేద మందు తయారీలో ఉపయోగిస్తారు.అయితే.. ఈ మొక్క వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మనం రోజూ ఈ మొక్కను చూస్తూనే ఉంటాం కానీ.. అస్సలు పట్టించుకోము. ఈ మొక్కలో ఉన్న ఔషధ గుణాలు ఏంటో తెలుసుకుంటే మాత్రం మీరు ఆ మొక్కను అస్సలు వదలరు. దాని ఔషధ గుణాలు తెలుసుకొని ఆశ్చర్యపోతారు.

health benefits of sugandi pala mokka
Sugandi Plant : ఈ మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
సుగంధి మొక్క నుంచి వేర్లను తీసుకొని చాలా ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తారని తెలుసు కదా. అయితే… ఎటువంటి జబ్బులకు ఇది బెస్ట్ మెడిసిన్ అంటే.. అజీర్తి సమస్యలు ఉన్నా.. రుమాటిజం ఉన్నా.. చర్మ సమస్యలు ఉన్నా.. మూత్ర వ్యాధులు ఉన్నా.. ల్యూకోరోయా ఉన్నా.. జ్వరం, వికారం, వాంతులు లాంటి సమస్యలు ఉన్నాయ.. పేగుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నా.. ఈ మొక్క ద్వారా తయారు చేసిన ఆయుర్వేద మందులతో తగ్గిస్తారు.సుగంధి మొక్క వేర్లను కట్ చేసి.. దాన్ని పేస్ట్ లా చేసి.. ముఖం నుదిటి మీద రాస్తే.. జ్వరం, వేడి, తలనొప్పి తగ్గుతాయట. శరీరం మీద దురద ఉన్నా కూడా.. వేర్ల మిశ్రమాన్ని రుద్దుకుంటే దురద సమస్య తగ్గుతుంది. వేర్లతో చేసిన కషాయాన్ని కూడా తాగొచ్చు. అలా చేస్తే మహిళల్లో అధిక రుతు ప్రవాహాన్ని తగ్గిస్తుంది. దగ్గు, హైబీపీ, ఉబ్బసం, మూర్చ వ్యాధి లాంటి సమస్యలు ఉన్నా సుగంధి మొక్క వేరుతో నయం చేయవచ్చు.

health benefits of sugandi pala mokka
ఇది కూడా చదవండి ==> పొద్దు తిరుగుడు గింజల వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.. ఈ విషయం తెలిస్తే మీరు అస్సలు వదలరు..!
ఇది కూడా చదవండి ==> మేడి పండు + మర్రి పండు = అత్తి పండు.. పోషకాలు నిండు.. ఆరోగ్యం మెండు..
ఇది కూడా చదవండి ==> అలోవేరాలో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా..? ఎక్కడ కనిపించినా ముందు ఇంటికి తెచ్చుకోండి..!
ఇది కూడా చదవండి ==> ఆల్ బుఖారా పండ్లను ఎప్పుడైనా తిన్నారా? వర్షాకాలంలోనే దొరికే ఈ పండ్ల ప్రత్యేకత ఏంటో తెలుసా?