Dengue : వర్షాకాలం స్టార్ట్ అయింది. ఈ సమయంలో వైరస్ లు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. అందుకే.. పిల్లలు, పెద్దలు అందరూ వర్షాకాలంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దోమల వల్ల చాలా వ్యాధులు ప్రబలుతాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి వ్యాధులు వస్తాయి. వీటిలో డెంగ్యూ, మలేరియా లాంటివి పెద్ద వ్యాధులు. వాటి నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అసలు డెంగ్యూ రాకుండా ఏం చేయాలి? వస్తే ఎటువంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా డెంగ్యూ దోమలు కుట్టడం వల్ల వస్తుంది. దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డెంగ్యూ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. డెంగ్యూ వచ్చిన వారం లోపు దాన్ని లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రంగా జ్వరం రావడం, తలనొప్పి, నీరసం, వాంతులు లాంటి లక్షణాలు కనిపిస్తే.. డెంగ్యూ వచ్చినట్టే. ఇటువంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఎందుకంటే.. డెంగ్యూ తీవ్రత ఎక్కువవుతున్నా కొద్దీ పరిస్థితి సీరియస్ గా అవుతుంది. అందుకే.. డెంగ్యూ ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడే దాన్ని ఎదుర్కోవాలి.
అయితే.. దోమలు కుట్టినప్పుడు రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్లలో అది అటాక్ చేస్తుంది. అందుకే రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రోగ నిరోధక శక్తి తక్కువవుతున్నా కొద్దీ.. డెంగ్యూ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లకు డెంగ్యూ అటాక్ అయితే.. dengue hemorrhagic రిస్క్ పెరుగుతుంది. డెంగ్యూ వస్తే.. దానికి సరైన ట్రీట్ మెంట్ లేదు. డెంగ్యూ వచ్చిన వాళ్ల లక్షణాలను బట్టి డాక్టర్లు ట్రీట్ మెంట్ చేస్తుంటారు. జ్వరం వచ్చిన వాళ్లు పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోవాలి. అలాగే.. కొందరు పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. కానీ.. పెయిన్ కిల్లర్స్ అస్సలు వాడకూడదు.డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్ నే వాడాల్సి ఉంటుంది. డెంగ్యూ వచ్చిన వాళ్లు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. అన్నం తినకుండా.. జ్యూస్ లు తాగాలి. ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. డెంగ్యూ రాకుండా ఉండాలంటే.. ఇంటి దగ్గర, చుట్టు పక్కన, ఇంట్లో దోమలు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వర్షాకాలంలో.. ఇంటి దగ్గర ఎటువంటి నీటి గుంతలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే.. నీటి గుంతలే దోమలకు నిలయం. దోమలు రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటే డెంగ్యూ వచ్చే చాన్సే ఉండదు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.