Vallabhaneni Vamsi.. వంశీ విషయంలో చంద్రబాబు నిజంగానే తప్పు చేశారా..?
Vallabhaneni Vamsi.. వల్లభనేని వంశీ.. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఇతని పేరు వినగానే తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని పార్టీ నుంచి బహిష్కరించాలని ముక్త కంఠతో చెబుతున్నారట.. కానీ, బాబు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారో తెలియక టీడీపీ నేతలు కక్కలేకమింగలేక ఊరుకుంటున్నారట. వంశీ వైసీపీ సపోర్టు చేసినప్పుడే క్రమశిక్షణా చర్యల కింద అతన్ని బాబు పార్టీ నుంచి బహిష్కరిస్తే బాగుండేదన్న వాదనలు వినిపించాయి. బాబు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా తటపటాయిస్తుంటారు. అదే బాబు కొంపముంచిందని అంటున్నారు విశ్లేషకులు..
మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనాయకుడు, ఎంతో రాజకీయ అనుభవం క కలిగిన నేత అలా మీడియా పాయింట్‌లో గుక్కపట్టి ఏడ్వటం అందరినీ కలిసివేసింది. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తనను చాలా వేధించారని, చివరకు తన భార్యను దూషించారని కన్నీటిపర్యంమయ్యారు బాబు. అయితే, ఈ కామెంట్స్ మొదట వచ్చింది గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నుంచే అని టీడీపీ నేతలు సైతం ధృవీకరించారు.నారా లోకేష్ అలియాస్ ‘పప్పు’గా తయారవడానికి అతనిలో మాజీ మంత్రి ‘ఎలిమినేటి మాధవరావు’పోలికలు ఉన్నాయని అసెంబ్లీలో వైసీపీ నేతలు కామెంట్ చేశారని బాబు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.
Vallabhaneni Vamsi..టీడీపీలో ఉన్నా వైసీపీకే సపోర్టు..
సీఎం అయ్యాకే మళ్లీ సభకు వస్తానని సవాల్ విసిరారు. అయితే, ఈ కామెంట్స్ మొదట చేసింది వల్లభనేని వంశీనట.. వైసీపీ నేతలు కూడా ఇదే విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మీ పార్టీ నేతనే అన్నారని మేము కాదని చెప్పారు. అయితే, వల్లభనేని వంశీ టీడీపీలో ఉన్నా వైసీపీకి సపోర్టుగా మాట్లాడారు. అతను టీడీపీ పార్టీకి రాజీనామా చేసిన బాబు ఆమోదం తెలపలేదు. పార్టీ నుంచి బహిష్కరించలేదు. ఇదే బాబు చేసిన పెద్ద మిస్టేక్ అని తెలుగు తమ్ముళ్లు సీరియస్ అవుతున్నారు. అతని వలన పార్టీకి ఏం లాభం లేదని కూడా కుండబద్దలు కొడుతున్నారు. ఇప్పటికైనా బాబు వంశీపై చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే.