Health Tips | సెలబ్రిటీలు తినే సూపర్‌ఫుడ్ ‘కినోవా’ .. మీ ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా?
Health Tips | ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై చైతన్యం పెరిగిపోయింది. ఫిట్‌గా ఉండేందుకు జిమ్‌కి వెళ్లడం, డైట్ ప్లాన్స్ ఫాలో అవ్వడం చాలా మందికి అలవాటైపోయింది. ముఖ్యంగా, తినే ఆహారంలో పోషకాలు ఎక్కువగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. అలాంటి ఆరోగ్యసేవకుల కోసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా “సూపర్‌ఫుడ్”గా గుర్తింపు పొందిన కినోవా (Quinoa) ఒక అద్భుతమైన ఆహారం.
#image_title
కినోవా అంటే ఏమిటి?
కినోవా దక్షిణ అమెరికాకు చెందిన ధాన్య రకం. ఇది ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. అందుకే దీన్ని సెలబ్రిటీలు కూడా తమ డైట్‌లో భాగం చేసుకుంటున్నారు.
కినోవాలో ఉన్న పోషకాలు
ప్రోటీన్ అధికంగా: కినోవాలో మన శరీరానికి అవసరమైన తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. ముఖ్యంగా శాఖాహారులు కోసం ఇది అద్భుతమైన ప్రోటీన్ సోర్స్.
ఫైబర్ సమృద్ధిగా: జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
షుగర్ నియంత్రణ: గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. డయాబెటిస్ రోగులకు ఇది మంచి ఎంపిక.
మెటబాలిజం పెంపు: ఇందులో ఉండే మాంగనీస్ మెటబాలిజంను యాక్టివ్‌గా ఉంచి, శరీరంలో కొవ్వు కరుగడంలో సహాయపడుతుంది.
ఐరన్ సమృద్ధిగా: రక్తహీనత సమస్యను తగ్గించి, శక్తిని పెంచుతుంది.
కినోవా ఎలా వండాలి?
కినోవాను వండడం చాలా సులభం. ఉప్మా చేసినట్టుగా తయారు చేసుకోవచ్చు.
ముందుగా ఒక కప్పు కినోవాను నీటిలో 1–2 గంటలపాటు నానబెట్టండి.
ఆపై రెండు కప్పుల నీటిలో ఉడికించండి.
కూరగాయలు, మసాలాలు కలిపి ఉప్మా తరహాలో వండితే రుచిగా ఉంటుంది.
తేలికగా జీర్ణమయ్యే ఆహారం
రోజువారీ డైట్‌లో కినోవాను చేర్చుకోవడం వల్ల శక్తి పెరుగుతుంది, శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. బరువు తగ్గే ప్రయత్నం చేసే వారికి కూడా ఇది సరైన ఆప్షన్.