Funeral : అంత్యక్రియల్లో కుండను పగలగొట్టడానికి కారణం ఏంటో తెలుసా…
Funeral : సాధారణంగా ఒక మనిషికి చావు ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు. మనిషి కంటే అతను సంపాదించిన దానికే ఎక్కువ విలువను ఇచ్చే ఈ కాలంలో మనిషి ఆరోగ్యాన్ని కూడా పక్కనపెట్టి కష్టపడుతూ అనేక ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటూ మరణ సమయం ఇంకా ముందుకు వచ్చేటట్లు చేసుకుంటున్నారు.అయితే సినిమాల్లో ఒక మనిషి చనిపోయిన తర్వాత తన శరీరంలో నుండి అదే మనిషి రూపం బయటికి వచ్చి పడిపోయిన తన శరీరాన్ని లేపటం, తన బంధువులతో స్నేహితులతో నేను చనిపోలేదు బతికే ఉన్నాను అని చెప్పడం చూసే ఉంటారు. దానినే ఆత్మ అంటారు. నిజజీవితంలో కూడా ఇలానే జరుగుతుంది.
మనిషి చనిపోయిన తర్వాత తన అంత క్రియలు అయ్యేవరకు తన ఆత్మ మనిషి లోపలికి వెళ్లి మళ్లీ లేవడానికి ప్రయత్నిస్తుంది. శరీరం ఆత్మ రెండు వేరు వేరు. ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలి అంటే మనిషి ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే బతికే ఉండాలి. చనిపోయిన తర్వాత ఆత్మ శక్తి శరీరం వినే పరిస్థితిలో ఉండదు. అందుకే ఆత్మ తన వాళ్ళతో కలిసి ఉండడానికి శరీరాన్ని లేపి అందులోకి దూరడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. చనిపోయిన తర్వాత శరీరం మీద ఒక బూటలో కట్టిన బియ్యపు గింజలను తీసి పరుస్తారు. ఆ గింజలన్నీ ఆత్మ సూర్యోదయం అయ్యేలోపు లెక్కించాలి. అప్పుడే ఆత్మకు తన వాళ్ళని చూసే అవకాశం వస్తుంది.
ఒకవేళ సూర్యోదయం లోపు లెక్కించకపోతే మళ్లీ మొదటి నుండి లెక్కించాల్సి వస్తుంది. మనిషి చితి చుట్టూ పట్టుకొని తిరిగే కుండ ఆ మనిషిని సూచిస్తుంది. అందులో ఉన్న నీళ్లు మనిషి ఆత్మ చనిపోయిన తర్వాత ఎలాగైతే ఆత్మ మనలో నుండి బయటకు వెళ్లి పోతుందో అలాగే నీరు కూడా మెల్లమెల్లగా బయటకి వెళ్ళిపోవడానికి రంధ్రాలు పెడతారు. కుండ పగలకొట్టడానికి కారణం ఏంటంటే ఇంకా ఆత్మకు శరీరం లేదు. ఇప్పుడు కాల్చేస్తున్నాము అని ఆత్మను వెళ్ళిపొమ్మని చెప్పడం. ఇలా హిందూ సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు మాత్రమే కాదు మనిషి ఆచారం ప్రకారం చేసి ప్రతి పని వెనక అంతరార్థం ఉంటుంది.