Gangavva : గంగ‌వ్వ కొడుకుని ఎప్పుడైన చూశారా.. ఆయ‌న గురించి మీకేమైన తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gangavva : గంగ‌వ్వ కొడుకుని ఎప్పుడైన చూశారా.. ఆయ‌న గురించి మీకేమైన తెలుసా?

 Authored By sandeep | The Telugu News | Updated on :24 January 2022,3:30 pm

Gangavva : యూట్యూబ్ సంచ‌ల‌నం గంగ‌వ్వ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆరంభంలో యూట్యూబ్‌కే పరిమితమైన గంగవ్వ బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. ఈ క్రేజ్‌తో గత కొంత కాలంగా వరుస సినిమాలతో బిజీ అవుతోంది. లవ్ స్టోరీలో నటించిన ఆమె.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలోనూ నటిస్తోంది. తాను చిరంజీవికి అమ్మగా నటిస్తున్నానని కూడా గంగవ్వ చెప్పింది. మై విలేజ్ షో పేరుతో యూట్యూబ్ లో విడుదలైన వీడియోలలో గంగ‌వ్వ ఎంత‌గా ఆక‌ట్టుకుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. గంగవ్వ తెలంగాణా యాక్సెంట్, ఆటిట్యూడ్, బిహేవియర్ యూట్యూబ్ ప్రేక్షకులకు మజా పంచేది.

గంగవ్వ వీడియోలకు మిలియన్స్ వ్యూస్ దక్కేవి. గంగ‌వ్వ గురించి అంద‌రికి బాగానే సుప‌రిచితం. కాని ఆమె ఫ్యామిలీ గురించి గురించి పెద్ద‌గా ఎవ‌రికి తెలియ‌దు. గంగవ్వ తల్లిదండ్రి మరణించగా, ఆమె భర్త తాగుడుకు బానిసయ్యాడు. తన భర్త సహకారం లేకుండానే గంగవ్వ ఇద్దరు కూతుర్లు, కొడుకు పెళ్లి చేసింది. గంగ‌వ్వ కొడుకు రాజా రెడ్డి యూట్యూబ్ ఛానెల్‌కి డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశాడు. 2019లో గంగవ్వ కొడుకు రాజా సూసైడ్ ఎటెమ్ట్ చేశాడు. పొలంలో పురుగు మందు తాగడడంతో అతడిని జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్క‌డ చికిత్స త‌ర్వాత కోలుకున్న‌ట్టు స‌మాచారం.

do you know the son of gangavva

do you know the son of gangavva

Gangavva : గంగ‌వ్వ కొడుకు ఎవ‌రు?

గంగవ్వ పూరీ జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’, ‘మల్లేశం’, ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. ఇకపోతే ప్రస్తుతం గంగవ్వ పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నది. శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరి’ ఫిల్మ్ లోనూ గంగవ్వ కీ రోల్ ప్లే చేసింది. కొద్ది రోజుల క్రితం గంగవ్వ జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి లో కొత్తగా నిర్మించుకున్న ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. ఈ నూతన గృహప్రవేశానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, తో పాటు బిగ్ బాస్ సీజన్ 4 లోని సభ్యులు శివజ్యోతి , అఖిల్ లు హాజరయ్యారు. నాగార్జున‌, బిగ్ బాస్ ద‌య వ‌ల‌న తాను కొత్త ఇల్లు నిర్మించుకున్నా అని గంగ‌వ్వ తెలిపింది.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది