Fish : మూడు కోట్లు విలువ చేసే చేప.. దీనికి ప్రత్యేకంగా సెక్యూరిటీ..!
Fish : చేప ఖరీదు మూడు కోట్లు.. ఇది వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉంది కదా..! అసలు అంత ధర పెట్టి ఎవరు కొంటారనే అనే అనుమానం కూడా కలుగక మానదు. సాధారణంగా మనం ఇప్పటి వరకు విన్న ఖరీదైన చేపలు వెయ్చి రూపాయల లోపే ఉంటాయి. కాని ఇప్పుడు మనం చూస్తున్న చేప ధర రూ.2 నుంచి 3 కోట్లు. అవును ఇది నిజం. డ్రాగన్ ఫిష్ లేదా ఏషియన్ అరోవానా అని పిలిచే ఈ చేప ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేపగా పేరుగాంచింది.ఈ చేప ఖరీదైన బంగారం, డైమండ్స్ కన్నా విలువైంది.
దీని పేరు డ్రాగన్ ఫిష్.. ఆసియా అరవోనా అని కూడా అంటారు. ఈ చేప ప్రపంచంలోని అత్యంత ఖరీదైన చేప. ఒక అధ్యయనం ప్రకారం చైనా ప్రజలు ఈ చేప కోసం ఎంత ధర అయినా వెచ్చించేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ చేప గురించి ది డ్రాగన్ బిహైండ్ ది గ్లాస్ అనే పుస్తకం కూడా రాసారు. ఈ చేప జీవిత చరిత్ర మొత్తం ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఈ చేప ధర ఎక్కువగా ఉండటం వల్ల దీనికోసం పలు గొడవలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.అరోవన్ అందరికి కనిపించే ఒక సాధారణ చేప కాదు. ఇది ఆగ్నేయాసియాలో కనుగొన్నారు.
Fish : ఈ చేప గురించి వింటే షాకవ్వాల్సిందే..
ఇది 3 అడుగుల పొడవు ఉంటుంది.19వ, 20వ శతాబ్దాలలో డ్రాగన్ ఫిష్ కోసం ప్రజలు ఒకరినొకరు చంపుకునేవారని చరిత్ర చెబుతోంది. 2009లో డ్రాగన్ ఫిష్ వ్యాపారం చేసే ఓ వ్యక్తి తాను ఒక చేపను 3 లక్షల డాలర్లకు అమ్మినట్లు తెలిపాడు. ఆసియాతో పాటు అనేక దేశాలలో ఈ చేపలను అమ్మడంపై నిషేధం ఉంది. ఈ చేపలు ఎక్కడుంటే అక్కడ అదృష్టం ఉంటుందని నమ్ముతారు. ఈ ఎరుపు రంగు చేప విలువైన వజ్రం లాంటిది. ప్రజలు దీనిని అక్వేరియంలో ఉంచుతారు. ఈ చేప రక్షణ కోసం చాలా మంది తమ సెక్యూరిటీని కాపలాగా ఉంచుతారు.