Health Problems : తిన్న వెంటనే నీటిని తాగుతున్నారా.. అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లేనట..
Health Problems : నీరు.. మనిషి బతికేందుకు చాలా అవసరమైనది. గాలి ఎంత ముఖ్యభూమిక పోషిస్తుందో నీరు కూడా అంతే ముఖ్య భూమికను పోషిస్తుంది. కావున నీరు అనేది మానవులకు చాలా ముఖ్యం. కానీ అటువంటి నీటి విషయంలో చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి. అసలు వైద్యులు చెప్పేదాని ప్రకారం మనిషి రోజుకు 10 నుంచి 12 గ్లాసుల నీటిని తాగాలట. కానీ నేటి రోజుల్లో చాలా మంది అలా సరైన మోతాదులో నీటిని తీసుకోవడం లేదు. అందుకు రకారకాల కారణాలు ఉంటాయి. కారణాలు ఏవైనా కానీ సరైన విధంగా నీటిని తీసుకోకపోవడంతో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.కొంత మంది ఇలా తినడంతోనే అలా గడగడా నీటిని తాగేస్తారు. కానీ ఇలా తిన్న వెంటనే నీటిని తాగడం మంచిది కాదట.
ఇలా నీటిని తాగడం వలన కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కావున తిన్న వెంటనే నీటిని తాగకుండా కాస్తంత గ్యాప్ ఇచ్చిన తర్వాత నీటిని తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఎటువంటి అనారోగ్యాలు ఎదురు కాకుండా ఉండాలంటే ఈ పద్ధతిని పాటించాలని చెబుతున్నారు.తిన్న వెంటనే నీటిని తీసుకుంటే ఏమవుతుందని చాలా మంది ఎదురు ప్రశ్నలు వేస్తారు. ఎంత మంది నిపుణులు ఎన్ని విధాలుగా చెప్పినా కానీ హా.. ఏమవుతుందిలే అని అనుకుని నీటిని తాగేస్తారు. కానీ ఇలా తిన్న వెంటనే నీటిని తాగడం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో, అసలు మన జీర్ణక్రియలో ఎటువంటి మార్పులు సంభవిస్తాయో వైద్యుల మాటల్లోనే…
- ఒక వ్యక్తి ఆహారాన్ని తీసుకున్న ఒక గంట 1 తర్వాత మాత్రమే నీటిని తీసుకోవాలి.
- ఇలా గంట గ్యాప్ ఇచ్చి నీటిని తీసుకోవడం వలన వ్యక్తి బరువును నియంత్రించేందుకు వీలుంటుంది. బరువు తగ్గాలని అనుకున్న వారు తిన్న తర్వాత నీరు తాగేందుకు గంట సేపు గ్యాప్ ఇవ్వాలి.
- ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత రెండు గ్లాసుల నీటిని తాగడం చాలా మంచిది.
- మనం ఆహారం తిన్న తర్వాత మన జీర్ణవ్యవస్థ మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో నిమగ్నమవుతుంది. అటువంటి సమయంలో జీర్ణవ్యవస్థ మంచి వేడి మీద ఉంటుంది. కావున మీరు అప్పుడు నీటిని తాగితే జీర్ణవ్యవస్థ మొత్తం చల్లబడి ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.
- ఆహారం తినడానికి అరగంట ముందు కూడా నీటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.