Kidneys : కిడ్నీలు బాగా పనిచేయాలంటే .. ఖచ్చితంగా ఈ ఫుడ్ తినాల్సిందే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kidneys : కిడ్నీలు బాగా పనిచేయాలంటే .. ఖచ్చితంగా ఈ ఫుడ్ తినాల్సిందే

 Authored By jagadesh | The Telugu News | Updated on :13 April 2021,6:00 am

Kidneys : కిడ్నీ… మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. మనిషికి రెండు కిడ్నీలు ఉన్నా… లెక్క ప్రకారం ఒకటే కిడ్నీ కింద లెక్కేసుకోవాలి. ఎందుకంటే.. రెండు కిడ్నీలు సరిగ్గా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఏ ఒక్క కిడ్నీ చెడిపోయినా.. రెండో కిడ్నీ కూడా చెడిపోతుంది. రెండింటి మధ్య ఉన్న కనెక్షన్ కారణంగా రెండు కిడ్నీలు బాగా పనిచేస్తేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అయితే.. కొన్ని సంవత్సరాల క్రితం అసలు కిడ్నీ సమస్యలు అంటేనే ఎవ్వరికీ తెలిసేవి కావు. కానీ.. ఇప్పుడు చూస్తే.. ప్రతి 10 మందిలో ఐదారుగురికి కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. కిడ్నీలు చెడిపోవడం, కిడ్నీల్లో ఇన్ఫెక్షన్ రావడం, ఇతర సమస్యల వల్ల చాలా మంది చనిపోతున్నారు. కిడ్నీ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు దాని కారణం… మనిషి అవలంభిస్తున్న విధానాలు, తింటున్న తిండి, జీవన విధానం… ఇవన్నీ కిడ్నీ సమస్యలను పెంచుతున్నాయి. కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే అసలు.. జీవితంలో కిడ్నీ సమస్యలు లేకుండా సంతోషంగా జీవించవచ్చు. అవేంటే ఇప్పుడు తెలుసుకుందాం రండి.

eat healthy food for kidney health

eat healthy food for kidney health

కిడ్నీలు బాగుండాలన్నా… కిడ్నీ సమస్యలు రాకూడదన్నా కూడా తినాల్సిన వాటిలో మొదటిది క్యాప్సికం. చాలామందికి క్యాప్సికం అంటే నచ్చదు. అది కొంచెం మిరపకాయలాగా అనిపిస్తుంది. అందుకే… దాన్ని చాలామంది తినరు. కానీ… క్యాప్సికంను ఖచ్చితంగా తినాల్సిందే. ముఖ్యంగా ఎరుపు రంగు క్యాప్సికాన్ని తింటే కిడ్నీని పది కాలాల పాటు కాపాడుకున్నట్టే. ఎందుకంటే… క్యాప్సికంలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. లైకోపీన్ అనే యాంటీ యాక్సిడెంట్ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే…. క్యాప్సికంలో ఇంకా చాలా రకాలు విటమిన్లు ఉంటాయి.

అలాగే… ఎక్కువగా ఉల్లిపాయలను వాడుతుండాలి. ఉల్లిపాయలతో పాటు వెల్లుల్లిని కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. వెల్లుల్లి ఎంత తింటే అంత మంచిది. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ కిడ్నీ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతాయి. కిడ్నీ సమస్యలతో బాధపడుతూ డయాలసిస్ చేసుకునేవాళ్లు వీటిని ఖచ్చితంగా తినాల్సిందే.

Kidneys : క్యాబేజీ, కాలిఫ్లవర్ ను ఖచ్చితంగా తీసుకోవాలి

కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు క్యాప్సికంతో పాటు.. క్యాబేజీ, కాలిఫ్లవర్ ను కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. క్యాబేజీలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు కిడ్నీలను చెడిపోకుండా కాపాడుతాయి. క్యాబేజీలో విటమిన్ కే, సీ, ఫైబర్ కిడ్నీలకు ఆరోగ్యాన్ని చేకూర్చుతాయి.

దానితో పాటు కాలిఫ్లవర్ కూడా కిడ్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. కాలిఫ్లవర్ లో విటమిన్ సీ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ, ఫోలేట్ యాసిడ్ కూడా ఉంటుంది. ఇవి కిడ్నీ ఆరోగ్యాన్ని పది కాలాల పాటు చల్లగా చూస్తాయి.

ఇక.. పండ్ల విషయానికి వస్తే… కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు ఎక్కువగా స్ట్రాబెర్రీని తినాల్సి ఉంటుంది. అలాగే కాన్ బెర్రీలు దొరికితే వాటిని కూడా తినొచ్చు. ఈ పండ్లలో అధికంగా యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. అవి కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది