Etela Rajender : ఈటల గెలుపు బీజేపీకి కలిసొస్తుందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Etela Rajender : ఈటల గెలుపు బీజేపీకి కలిసొస్తుందా..?

Etela Rajender : హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు వెయిట్ చేశారు. ఆ ఉత్కంఠ వీడింది. ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో నిలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ 24 వేల మెజారిటీతో ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికయ్యారు. 2004లో రాజకీయాల్లోకి వచ్చింది మొదలు ఇప్పటి వరకు హుజురాబాద్ నియోజకవర్గానికి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి అనేది ఎరుగని నేతగా రికార్డు సృష్టించారు.మాజీ మంత్రి ఈటల రాజేందర్ […]

 Authored By mallesh | The Telugu News | Updated on :3 November 2021,11:00 am

Etela Rajender : హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు వెయిట్ చేశారు. ఆ ఉత్కంఠ వీడింది. ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున బరిలో నిలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ 24 వేల మెజారిటీతో ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికయ్యారు. 2004లో రాజకీయాల్లోకి వచ్చింది మొదలు ఇప్పటి వరకు హుజురాబాద్ నియోజకవర్గానికి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై.. ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి అనేది ఎరుగని నేతగా రికార్డు సృష్టించారు.మాజీ మంత్రి ఈటల రాజేందర్ గెలుపుతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం కనబడుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీకి మంచి పట్టు దొరికినట్లయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలోని పలు అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో కమలం పార్టీ ఇంకా బలోపేతం అయి అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చే చాన్సెస్ కనబడుతున్నాయి.

Etela rajendar

Etela-rajendar

Etela Rajender : బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం..

రాష్ట్రవ్యాప్తంగానూ బీజేపీకి గ్రాఫ్ బాగా పెరిగే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ తరఫున శాసనసభ్యులుగా ‘ఆర్ఆర్ఆర్’ రాజాసింగ్, రఘునందన్, రాజేందర్ వెళ్లనున్నారు. మొత్తంగా ఈటల గెలుపు బీజేపీకి కలిసొస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన టీఆర్ఎస్ పార్టీ తరఫున 2004 నుంచి ప్రజల్లో ఉన్న ఈటల రాజేందర్..ఆ నాడు ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో టీఆర్ఎస్ పక్షనేతగా ఉండి ప్రజల వాయిస్ వినిపించారు. తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించారు. బక్క పలుచని దేహం ఉన్న వ్యక్తిగా ఈటల కనిపించినప్పటికీ ఆయన మాటలు ప్రజల్లోకి తూటల్లా వెళ్లాయి.

Etela Rajender : ‘ప్రజాదీవెన’తో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మళ్లీ సభలోకి..

Etela rajendar

Etela-rajendar

టీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ లీడర్‌గా ఈటలకు పేరు కూడా వచ్చింది. కానీ, ఇటీవల కాలంలో అసైన్డ్ భూముల ఆక్రమణల నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ను పదవి నుంచి తొలగించారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన నేపథ్యంలో ఈటల తొలుత టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత హుజురాబాద్ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయగా ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ తర్వాత పరిణామాల్లో బీజేపీలో చేరిన ఈటల ఆ పార్టీ నుంచి అభ్యర్థిగా బరిలో ఉండగా, ఈటలను ఓడించేందుకుగాను అధికార టీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులను ఒడ్డింది. సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి ‘దళిత బంధు’ పైలట్ ప్రాజెక్టును నియోజకవర్గంలో ప్రారంభించారు. టీఆర్ఎస్‌వీ నేత గెల్లును గెలిపించాలని అభ్యర్థించాడు. కానీ, ప్రజలు ఈటల వైపే మొగ్గు చూపారు. టీఆర్ఎస్ అభివృద్ధి మంత్రం కాని, సంక్షేమ రాగం కాని, దళిత బంధు పథకం కాని ఏది కూడా ఆ పార్టీని గట్టెక్కించలేకపోయింది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది