Etela rajender : కీలక అడుగు వేస్తున్న ఈటెల.. ఆ పార్టీలో చేరినట్లే..?
Etela rajender తెరాస పార్టీ నుండి దాదాపుగా బయటకు వచ్చిన కీలక నేత ఒకప్పటి ఉద్యమ నాయకుడు ఈటెల రాజేందర్ Etela rajender రాజకీయంగా ఇప్పుడు కూడలిలో నిలబడి ఉన్నాడు. మంత్రివర్గం నుండి కేసీఆర్ బయటకు పంపిన తర్వాత తెరాస మీద తిరుగుబాటు జెండా ఎగరవేసిన ఈటల మిగిలిన పార్టీల మద్దతు కూడగట్టి వాటి సహాయంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో తెరాసకు గట్టి షాక్ ఇవ్వాలని భావించాడు.
అయితే ఈటల కు ఊహించని షాక్ లు తగులుతూనే ఉన్నాయి. గత కొద్దీ రోజుల నుండి అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ లోని కీలక నేతలతో వరసగా భేటీలు నిర్వహించాడు. ఈ క్రమంలో కాంగ్రెస్ నుండి సానుకూల స్పందన రాలేదని సమాచారం. బీజేపీ నేతలు మాత్రం స్వతంత్రంగా ఉప ఎన్నికల్లో పోటీచేస్తే తాము మద్దతు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ఈటల రాజేందర్ బీజేపీలోకి చేరి ఆ పార్టీ తరుపున పోటీచేయాలని, ఆ తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపు లభించేలా చేస్తామని బీజేపీ నేతలు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
దీనితో ఈటల కాషాయం గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. “పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆపాయిట్మెంట్ ఖరారు కాగానే ఈటల ఢిల్లీ వెళ్లి కలుస్తారు. ఎమ్మెల్యే పదవికి ఎప్పుడు రాజీనామా చేయాలి అనేది జాతీయ నాయకత్వంతో మాట్లాడిన తర్వాత సృష్టత వస్తుందని” బీజేపీ ముఖ్యనేత ఒకరు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈటల బయోడేటా ఢిల్లీ బీజేపీ అగ్రనేతల దగ్గరకు చేరుకున్నట్లు తెలుస్తుంది.

Etela rajender is taking a key step like joining bjp
బీజేపీ తెలంగాణ ఇంచార్జి తరుణ్ ఛుగ్ తో పటు బండి సంజయ్, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ ఈ ముగ్గురు ఈటల విషయంలో కీలకంగా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీలో చేరితే మీ పోరాటానికి మేము అండగా ఉంటామని ఛుగ్ తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఈటల రాజేందర్ Etela rajender కూడా తన వర్గం నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది. శామీర్ పేట లోని ఆయన స్వగృహంలో కీలక అనుచరులతో భేటీ అయినట్లు సమాచారం.ఈటల వ్యవహారం చూస్తుంటే దాదాపుగా బీజేపీలోకి చేరినట్లే అనిపిస్తుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు