మిత్రుడి ప్రాణం కోసం .. 1440 కిలోమీటర్లు నుండి ఆక్సిజన్ సిలిండర్
oxygen cylinder స్నేహ బంధానికి మించిన మరో బంధం లేదనే మాటను నిజం చేసే సంఘటన తాజాగా జరిగింది. కరోనా వలన దేశ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కరోనా కు సరైన మందు లేకపోవటం, దాని నివారణకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్స్ కొరత ఉండటం, వాటికీ తోడు దేశంలో ఆక్సిజన్ oxygen cylinder కొరత తోడు కావటంతో రోజు రోజుకి దేశంలో కరోనా మరణాలు ఎక్కువవుతున్నాయి. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇప్పుడు ఆక్సిజన్ అవసరం ఏర్పడింది.
సాధారణంగా కరోనా సోకిన వ్యక్తిని చూడటానికి కూడా భయపడే పరిస్థితుల్లో దేవేంద్ర అనే వ్యక్తి తన స్నేహితుడి కోసం జార్ఖండ్ నుంచి నొయిడాకు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఆక్సిజన్ తీసుకెళ్లాడు. ఫ్రెండ్ ప్రాణాలు కాపాడుకున్నాడు. అతడు చేసిన ఈ సాహసానికి యావత్తు దేశం ఇప్పుడు మెచ్చుకుంటుంది. దేవేంద్ర మరియు రంజన్ అగర్వాల్ స్నేహితులు. దేవేంద్ర బొకారోలో ఓ సాధారణ స్కూల్ టీచర్.రంజన్ అగర్వాల్ నొయిడాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్.
oxygen cylinder : స్నేహితుడి కోసం 1440 కిలోమీటర్లు ..
రంజన్ కు కరోనా పాజిటివ్ రావటంతో అతనికి ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. అయితే ఢిల్లీలో భారీ స్థాయిలో ఆక్సిజన్ oxygen cylinder కొరత ఉండటంతో ఎక్కడ కూడా రంజన్ కు ఆక్సిజన్ దొరకలేదు విషయం తెలుసుకున్న దేవేంద్ర.. బొకారో స్టీల్ ప్లాంట్ ను సంప్రదించాడు.ఖాళీ సిలిండర్ తెచ్చుకుంటే ఆక్సిజన్ ఇస్తామన్నారు స్టీల్ ప్లాంట్ అధికారులు. వెంటనే 10వేల రూపాయలు డిపాజిట్ కట్టి, ఓ సిలిండర్ లో ఆక్సిజన్ ఎక్కించుకున్నాడు.
బొకారో నుంచి నొయిడా వెళ్తున్న క్రమంలో దేవేంద్ర కు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. బిహార్, ఉత్తర్ ప్రదేశ్ లో చాలా చోట్ల దేవేంద్రను పోలీసులు ఆపారు. బ్లాక్ మార్కెట్లో ఆక్సిజన్ ను తరలిస్తున్నాడని భావించి అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు, కానీ దేవేంద్ర అక్కడ అందరికి సర్దిచెప్పుకుంటూ కారులో 1440 కిలోమీటర్లు ప్రయాణించి స్నేహితుడ్ని చేరుకున్నాడు. సకాలంలో ఆక్సిజన్ అందడంతో రంజన్ ప్రాణాలు దక్కాయి. ఈ సంఘటనను చూస్తే స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వితం అనిపిస్తుంది.