Tomato Prices : మహిళలకు గుడ్ న్యూస్.. దిగివస్తున్న టమాటా ధరలు..
Tomato Prices : కూరగాయలు ఎన్ని ఉన్న టమాట ప్రత్యేకత వేరు. ఎందుకంటే దాదాపు అన్ని కూరల్లో తప్పకుండా వాడేది కనుక. మనిషి అత్యధికంగా వినియోగించే కురగాయ టమాటాలే.. మనిషి ఆహార ఆలవాటులతో ఇంతలా పెనవేసుకున్న టమాట ధర ఇప్పుడు ఆకాశాన్ని అంటుతోంది. సామాన్యుడు ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఒక్కోసారి కిలోకి రూపాయి కూడా ధర పడిపోయే టమాటా ఇంతలా ఎందుకు మండిపోతుంది. దేశవ్యాప్తంగా టమాటా ధరల మంట కొనసాగుతుంది. నిత్యం మన వంటల్లో ఉపయోగించే టమాటాల ధరలు ₹100 పైగా పలుకుతున్నాయి.
ఉత్పత్తి తగ్గడం మార్కెట్లో టమాటాలకు డిమాండ్ బాగా పెరగటం ఏప్రిల్ మే నెలలో కురిసిన అకాల వర్షాల ప్రభావం టమాటలను పెరగడానికి కారణమైంది. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా టమాటా ధరలు నియసించడం కోసం రంగంలోకి దిగిన వినియోగదారుల వ్యవహారాల శాఖ ధర నియంత్రణకు టమాట ఉత్పత్తి నిలువ విషయాల్లో ఏం చేయాలన్న దానిపై తమత గ్రహాలు నిర్వహించడానికి రెడీ అయింది. ఇందులో సూచించిన వివిధ ఆలోచనలను అధ్యయనం చేసి భవిష్యత్తులో టమాటాల ధరలు పెరగకుండా ఉండడం కోసం చర్యలను చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం టమాటా ధరల తగ్గుదల పైన దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం. తాజాగా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది.
టమాటాకు ధరలు తగ్గేఅవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మండిపోతున్న టమాట ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఉత్పత్తి కేంద్రాల నుండి పంట మార్కెట్లకు చేరడం వివిధ ప్రాంతాల నుండి టమాటా సరఫరా పెరగడమే ఇందుకు కారణం అని వెల్లడించారు. మరో నెల రోజులలో సాధారణ స్థాయికి వస్తాయని అంచనా వేస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
హిమాచల్ ప్రదేశ్ లోని సోలాన్, చిరుమూరి జిల్లా నుంచి ఢిల్లీకి తరలించిన టమాట సరఫరా మెరుగైందని త్వరలోనే టమాటా ధర తగ్గుతుందని పేర్కొన్నారు. ఇక తాజాగా కేంద్ర వినియోగదారుల శాఖ కార్యదర్శి చేసిన ప్రకటనతో సామాన్యులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.. ఇంతకుముందుల టమాట కేజీ 40 వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది.