Flax seeds : అవిసె గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Flax seeds : అవిసె గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాల్సిందే..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :30 May 2021,9:05 pm

Flax seeds : టైటిల్ చదవగానే.. అవిసె గింజలా? అంటే ఏంటి? ఎప్పుడూ చూడలేదే అనే డౌటు.. ఈ జనరేషన్ వాళ్లకు వస్తుంది. అవిసె గింజల గురించి ఈ జనరేషన్ కు తెలిసింది చాలా తక్కువ. అవిసె గింజల ప్రాముఖ్యత ఏంటో మన తాతలకు, ముత్తాతలకు బాగా తెలుసు. పెద్దలు అవిసె గింజలను ఎప్పటి నుంచో తింటున్నారు కానీ.. మనకు తెలియదు. మనకు ఎప్పుడూ పిజ్జాలు, బర్గర్లు, చికెన్ బిర్యానీలు, ఫ్రెంచ్ ఫ్రైలు, చికెన్ లాలీ పాప్స్, సాండ్ విచ్ తప్పితే.. ఇలాంటి అద్భుతమైన ఔషధాల గని ఉన్న గింజల గురించి పెద్దగా తెలియదు. నిజానికి.. అవిసె గింజల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? అసలు.. వీటి ప్రాముఖ్యత ఇప్పుడు తెలుసుకున్నా చాలు.. వెంటనే కొనుక్కొని మరీ తినేస్తారు.

health benefits of flax seeds

health benefits of flax seeds

అవిసె గింజలలో పోషకాలకు కొదవే లేదు. ఒక చిన్న స్పూన్ అవిసె గింజలను తిన్నా చాలు.. దాంట్లో నుంచి 37 కేలరీల శక్తి లభిస్తుంది. అవిసె గింజలలో విటమిన్ బీ1, బీ6 పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్ యాసిడ్ లాంటి మినరల్స్ కు కూడా కొదవ లేదు. అలాగే.. ఫైబర్ కూడా ఎక్కువే. ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్లాలు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. అలాగే మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఇందులో ఉంటాయి. ఇన్ని పోషకాలు ఉన్న గింజలు వేరే ఏవైనా ఉంటాయా చెప్పండి. అందుకే.. అవిసె గింజలను క్రమం తప్పకుండా పెద్దలు తినేవారు.

Flax seeds : క్యాన్సర్ రాకుండా ఉండాలన్నా.. గుండె జబ్బులు తగ్గాలన్నా అవిసె గింజలను తినాల్సిందే

అవిసె గింజలను క్రమం తప్పకుండా తీసుకుంటే.. గుండె జబ్బులు వచ్చే చాన్సే లేదంటున్నారు నిపుణులు. ఇదేదో ఊరికే చెప్పడం కాదు.. కొందరిపై సర్వే చేసి మరీ.. టెస్ట్ చేసి మరీ బల్ల గుద్ది చెబుతున్నారు. ఇందులో ఉండే ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ గుండె జబ్బులను తగ్గిస్తాయట. అలాగే.. క్యాన్సర్ కారకాలను కూడా అవిసె గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చంపేస్తాయి. కొలెస్టరాల్ ఉన్నా.. జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నా.. మలబద్ధకం సమస్య ఉన్నా.. హైబీపీ ఉన్నా.. వాటన్నింటికీ సరైన ఔషధం అవిసె గింజలు.

ప్రస్తుతం షుగర్ వ్యాధి వల్ల ఎంత మంది బాధపడుతున్నారో అందరికీ తెలిసిందే. షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు క్రమం తప్పకుండా… అవిసె గింజలను తింటే.. వెంటనే షుగర్ లేవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. అవిసె గింజలను తిన్నా పర్లేదు లేదంటే.. వాటిని పొడి చేసుకొని తిన్నా కూడా షుగర్ కంట్రోల్ లో ఉంటుందట. అలాగే బరువు తగ్గాలనుకునే వాళ్లు కూడా అవిసె గింజలను తినొచ్చు. అవిసె గింజలను గుప్పెడు తిన్నా చాలు.. త్వరగా ఆకలి వేయదు. కడుపు నిండిన భావన కలుగుతుంది. అలాగే.. ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి.. త్వరగా బరువు తగ్గుతారు. అవిసె గింజలను అలాగే డైరెక్ట్ గా తినొచ్చు లేదంటే వాటిని పొడి చేసుకొని కూడా తినొచ్చు. రోజూ 10 నుంచి 50 గ్రాముల వరకు తీసుకున్నా కూడా ఏం కాదు. అవిసె గింజలను ఏ విధంగా తీసుకున్నా కూడా వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయి.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది