Jamun Fruit : షుగర్ ఉన్నవాళ్లు అల్లనేరేడు పండ్లను తింటే ఏమౌతుంది..? నిపుణులు ఏమంటున్నారు?
Jamun Fruit : అల్లనేరేడు పండ్లు లేదా నేరేడు పండ్లు లేదా జామూన్ పండ్లు.. పేరు ఏదైనా సరే.. అల్లనేరేడు పండ్లను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఎండాకాలం పూర్తయి.. నైరుతి రుతుపవనాలు వచ్చే సమయానికి.. నేరేడు పండ్లు మార్కెట్ లో దర్శనం ఇస్తాయి. వాటిని చూడగానే.. అబ్బ.. నోట్లేసుకోవాలి.. అనేంతలా నోరూరిస్తాయి. వాటిని తిన్నా కూడా ఆ టేస్ట్ వేరే. నేరేడు పండ్లను తినడం వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వాటిలో చాలా శక్తివంతమైన యాంటీ బయాటిక్స్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

health benefits of jamun fruit for diabetes patients
ఒక్క నేరేడు పండ్లను తినడం వల్ల శరీరంలోని దాదాపు చాలా వ్యాధులను నయం చేయొచ్చట. ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడుతున్న వాళ్లు, షుగర్ లేవల్స్ ఎక్కువగా ఉన్నవాళ్లు ఈ పండ్లను రోజూ వారి ఆహారంలో భాగం చేసుకోవాలట. నిత్యం అల్ల నేరేడు పండ్లను తింటే.. చాలా లాభాలు కలుగుతాయట. సాధారణంగా ఇన్సులిన్ లోపం వల్ల వచ్చే డయాబెటిస్ ను చెక్ పెట్టేందుకు అల్లనేరేడు పండ్లు దివ్యౌషధమని చెబుతున్నారు.
Jamun Fruit : అల్లనేరేడు పండ్లలో ఏ ఏ పోషకాలు ఉంటాయి?
అల్లనేరేడు పండ్లలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఏ, బీ3, సీ, బీ6 లాంటి వాటితో పాటు.. కాల్షియం, పొటాషియం, జింక్, సోడియం, ఇనుము, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో శరీరానికి మంచి చేసే ఎన్నో ఆమ్లాలు ఉంటాయి. ఇవన్నీ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అల్లనేరేడు పండ్లలో ఎక్కువ శాతం.. యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. గుజ్జు కూడా అధికంగా ఉంటుంది. యాంటీ డయాబెటిక్ గుణాల వల్ల.. శరీరంలోని షుగర్ లేవల్స్ ను అల్లనేరేడు పండు సమం చేస్తుంది.

diabetes
Jamun Fruit : నేరేడు పండ్లే కాదు.. దాని గింజలు కూడా అద్భుతమైన ఔషధాలు
సాధారణంగా చాలామంది నేరేడు పండ్లను మాత్రమే తింటారు. దాని గింజలను పక్కన పడేస్తారు. కానీ.. దాని గింజల్లో కూడా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయట. అల్లనేరేడు గింజలను పౌడర్ లా చేసి.. దాన్ని తీసుకుంటే.. త్వరగా డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుందట. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్ల గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేయడానికి.. నేరేడు గింజల పొడి చాలా బాగా ఉపయోగపడుతుందట. అందుకే.. షుగర్ వచ్చిన వాళ్లు నేరేడు పండ్లను తమ ఆహారంలో భాగం చేసుకుంటే.. తమ షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచుకున్నట్టే లెక్క. అలాగే.. అల్లనేరేడులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. దాన్నే జీఐ అంటారు. అది ఎంత తక్కువ ఉంటే.. రక్తంలో గ్లూకోజ్ లేవల్స్ అంత తక్కువగా ఉంటాయి. అందుకే.. జామూన్ తింటే రక్తంలో గ్లూకోజ్ లేవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

health benefits of jamun fruit for diabetes patients