Immune System : ఈ లక్షణాలు ఉన్నాయా? మీలో రోగనిరోధక శక్తి తగ్గినట్టే..!
Immune System : ప్రతి ఒక్కరికి ఇమ్యూన్ సిస్టమ్ చాలా అవసరం. దాన్నే మనం రోగనిరోధక శక్తి అంటాం. రోగనిరోధక శక్తి ఎంత ఎక్కువగా ఉంటే.. అంత బెటర్ గా మనం ఆరోగ్యంగా ఉంటాం. అది తగ్గుతోందంటే రోగాలు శరీరంలోకి ప్రవేశిస్తున్నట్టే లెక్క. ఇదివరకు మనం అంతగా దీని మీద దృష్టి పెట్టలేదు కానీ.. ఈమధ్య మహమ్మారి కారణంగా మనం ఇమ్యూనిటీ గురించి ఆలోచిస్తున్నాం. ఇమ్యూనిటీని పెంచే ఆహారం ఏంటో తెలుసుకుంటున్నాం. దాని మీద బాగానే దృష్టి పెడుతున్నాం.
శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఏ వైరస్ కూడా అటాక్ చేయలేదు. అయితే.. అసలు శరీరంలో రోగ నిరోధక శక్తి సరిపడినంత ఉందా? లేదా? అనే విషయం ఎలా తెలుసుకోవాలి? అసలు రోగ నిరోధక శక్తి ఎంత ఉందో ఎలా తెలుస్తుంది? అనేది చాలామందికి తెలియదు. అయితే.. శరీరంలో రోగ నిరోధక శక్తి ఉందో? లేదో తెలుసుకోవడానికి కొన్ని లక్షణాల వల్ల తెలుస్తుంది.
Immune System : ఈ సంకేతాలు కనిపిస్తే.. రోగనిరోధక శక్తి తగ్గినట్టే?
తరుచుగా అనారోగ్యానికి గురవుతున్నా.. నీరసంగా అనిపించినా కూడా శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినట్టే. జీర్ణ సంబంధ సమస్యలు వచ్చినా కూడా రోగ నిరోధక శక్తి తగ్గినట్టే. మలబద్ధకం సమస్య ఉన్నా.. గ్యాస్ సమస్యలు ఉన్నా, విరేచనాలు అవుతున్నా రోగ నిరోధక శక్తి తగ్గినట్టే. అలాగే.. కొందరికి గాయాలు అస్సలు మానవు. ఎక్కడైనా గాయమైతే.. వెంటనే మానితే.. శరీరంలో రోగ నిరోధక శక్తి ఉన్నట్టు. లేదంటే శరీరంలో రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. అలసట ఎక్కువైనా.. జలుబు ఎక్కువైనా కూడా రోగ నిరోధక శక్తి తగ్గినట్టే. ప్రతి చిన్నవిషయానికి ఆందోళన పడినా.. ఒత్తిడికి గురయినా కూడా ఒంట్లో రోగ నిరోధక శక్తి తగ్గిందని భావించాలి. వీటన్నింటినీ జయించాలంటే.. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే.. నిత్యం యోగా చేయాలి. వ్యాయామం చేయాలి. మెడిటేషన్ చేయాలి. ఆరోగ్యకరమైన జీవన శైలి ఉండాలి. ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. పౌష్ఠికాహారాన్ని తీసుకోవాలి. ఇలా చేస్తే.. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు.. పైన చెప్పుకున్న సమస్యలు కూడా దరిచేరవు.