మీరు ప్రెగ్నెంటా? అసలే వర్షాకాలం.. గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
అసలే వర్షాకాలం. వర్షాల వల్ల అనేక వైరస్ లు సోకుతాయి. అందుకే.. వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. దోమల వల్ల, ఈగల వల్ల అనేక వైరస్ లు సోకుతాయి. ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలకు వర్షాకాలం సీజన్ చాలా సమస్యలు తీసుకొస్తుంది. అందుకే.. చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భం దాల్చిన మహిళలు అయితే.. వర్షాకాలంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే.. వాళ్లకు ఎన్నో సమస్యలు వస్తాయి.గర్భిణీలకు.. ఈసమయంలో రోగ నిరోధక శక్తి ఒక్కసారిగా తగ్గిపోతుంది. దాని వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. అందుకే.. గర్భిణీలు వర్షాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రోగనిరోధక శక్తి తగ్గితే.. లేనిపోని వైరస్ లు అటాక్ చేస్తే.. తీవ్ర రక్త స్రావం అవుతుంది. అలాగే.. గర్భస్రావం అయ్యే చాన్సెస్ కూడా ఉంటాయి. అందుకే.. మహిళలు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ముఖ్యంగా గర్భిణీలకు డీహైడ్రేషన్ సమస్య వర్షాకాలంలో వేధిస్తుంటుంది. ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల.. డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. దాని వల్ల.. ఎక్కువగా ద్రవ పదార్థాలను తాగాలనే కోరిక వస్తుంటుంది. గర్భిణీలు ఎక్కువగా నీళ్లు తాగడం లేదా ఇతర జ్యూస్ లు తాగడం మంచిది. లేదంటే.. తలనొప్పి, అలసట దరిచేరే అవకాశం ఉంటుంది.
గర్భిణీలు పౌష్ఠికాహారం ఖచ్చితంగా తీసుకోవాలి
గర్భిణీలు తామొక్కరికే కాదు.. తమ కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే.. వాళ్లు పౌష్ఠికాహారాన్ని తీసుకోవాలి. ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారాన్ని తినాలి. ప్రొటీన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తినాలి. అలాగే.. వర్షాకాలంలో ఎక్కువగా దోమలు సంచరిస్తుంటాయి. వాటి బెడద నుంచి తప్పించుకోవాలి. ఇంట్లో దోమలు లేకుండా చేసుకోవాలి. లేకపోతే.. డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఖచ్చితంగా ఇంట్లోకి దోమలు రాకుండా నివారించుకోవాలి. గర్భిణీలు.. చాలా వదులుగా ఉండే డ్రెస్సులు వేసుకోవాలి. స్లీవ్ కాటన్ దుస్తులు అయితే చాలా బెటర్. అవి దోమకాటును నివారిస్తాయి. గర్భిణీలు తాము ఉండే ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లోకి బ్యాక్టీరియా చేరి లేనిపోని సమస్యలను తీసుకొస్తుంది. అలాగే.. గర్భిణీ స్త్రీలు కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి. ఎప్పుడూ చేతులు కడుక్కుంటూ ఉండాలి. ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే గర్భిణీలకు వర్షాకాలంలో ఎటువంటి సమస్య రాదు.