Health Benefits : ఈ ఆకులు తింటే రక్తహీనత రమ్మన్నా రాదు.. ఇదిగో ప్రూఫ్
Health Benefits : రక్తహీనత.. నేటి రోజుల్లో చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. రక్తహీనతను ఆంగ్లంలో ఎనీమియా అని అంటారు. కేవలం స్త్రీలు, కేవలం పురుషులు అనే కాకుండా ఇద్దరు కూడా ఎనీమియాతో బాధపడేవారు ఉన్నారు. ఎనీమియా అనేది నేటి రోజుల్లో సర్వసాధారమయిపోయింది. ఇలా రక్తహీనతతో బాధపడేందుకు గల కారణాలు అనేకం ఉన్నాయి. స్త్రీలల్లో రక్తహీనత వచ్చేందుకు ముఖ్య కారణం పీరియడ్స్. స్త్రీలల్లో తరచుగా వచ్చే పీరియడ్స్ వలన అధిక మోతాదులో రక్తస్రావం జరుగుతుంది. కావున వారికి రక్తహీనత సమస్య అధికంగా ఏర్పడుతుంది.
దీని నుంచి తమను తాము రక్షించుకునేందుకు స్త్రీలు అనేక రకాల ట్యాబ్లెట్స్ ను వాడుతూ ఉంటారు. కానీ వాటి వలన పెద్దగా ప్రయోజనం ఉండదు. కేవలం పై సమస్య వలనే కాకుండా విటమిన్స్ లోపం వలన కూడా ఎనీమియా వచ్చే అవకాశం ఉంది. కావున మనం తినే ఆహారంలో పోషకాలు, విటమిన్స్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.మన బాడీలో మనకు తెలియకుండా అప్పుడుప్పుడు రక్తస్రావం జరుగుతుంది. ఈ కారణం వలన కూడా మనకు ఎనీమియా వస్తుంది. కావున మనకు రక్తస్రావం కలగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంత మందికి మోషన్ లో రక్తస్రావం అవుతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఎనీమియా వస్తుంది.
Anemia : రక్తహీనతకు దివ్య ఔషధం ఈ ఆకులు
కొంత మంది ఆడవాళ్లకు పీరియడ్స్ సమయంలో అతిగా బ్లీడింగ్ అవుతుంది. ఇంకా కొంత మంది ఆడవాళ్లు గర్భవతులుగా ఉన్న సమయంలో తమ గురించి పట్టించుకోకుండా తమకు పుట్టబోయే పిల్లల ఆలనా, పాలనా చూసుకుంటూ గడిపేస్తారు. అటువంటి వారికి కూడా ఎనీమియా వచ్చే అవకాశం ఉంది. కావున ఎనీమియా రాకుండా ఉండేందుకు మంచిగా ఆహారం తీసుకోవడం అతి ముఖ్యం. ముఖ్యంగా మనం తినే ఆహారంలో పోషకాలు, విటమిన్స్ ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ మోతాదులో ఆకుకూరలను తినాలి. ఆకుకూరల్లో తోటకూర ఎక్కువగా తినే వారిలో ఎనీమియా రాకుండా ఉంటుంది. కావున తోటకూరకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి.