గాఢనిద్రలో ఉన్నప్పుడు చాతి మీద ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తోందా? దానికి కారణం ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు?
Sleep Paralysis : చాలామందికి అంటే నూటికి తొంబై మందికి నిద్రలో ఉన్నప్పుడు.. ముఖ్యంగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు కొన్ని కలలు వస్తుంటాయి. అదే సమయంలో ఒక్కోసారి వాళ్ల చాతి మీద ఏదో బరువుగా అనిపిస్తుంది. ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తుంది. లేద్దామంటే లేవలేరు.. గొంతును కూడా పట్టుకున్నట్టు అవుతుంది. అరవ లేరు. నోటి నుంచి మాట రాదు. ఎంత అరిచినా… గోల చేసినా.. ఎవ్వరికీ వినిపించదు. ఎంత ప్రయత్నించినా.. లేవలేరు. అసలు.. చేతుల, కాళ్లు ఏవీ కదలవు. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసా మీకు. దీన్ని ఏమంటారు? అసలు.. ఇలా జరగడం వల్ల ఏమైనా ప్రమాదమా ఇప్పుడు తెలుసుకుందాం రండి.

health issues with sleep paralysis
దీన్నే స్లీప్ పెరాలిసిస్ అంటారు. అది గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేదా తెల్లవారు జామున నిద్ర లేచే సమయానికి అలా జరుగుతుంటుంది. ఇది దాదాపుగా అందరికీ వస్తుంటుంది. మనిషి అన్న ప్రతి ఒక్కరికి కలలు ఎలా వస్తాయో… స్లీప్ పెరాలిసిస్ కూడా అంతే. అసలు.. మనిషికి కలలు ఎందుకు వస్తాయో తెలుసా? అది మెదడులో జరిగే ఒక ప్రతిచర్య. మెదడు ఆరోజు జరిగిన విషయాలను అన్నింటినీ రాత్రి పడుకున్నాక నెమరు వేసుకుంటుంది. ఆ సమయంలోనే అవి కలలుగా మనకు అనిపిస్తాయి. అలాగే.. కలలు వచ్చే సమయంలోనే ఇలా స్లీప్ పెరాలిసిస్ కూడా వస్తుంటుంది.
Sleep Paralysis : స్లీప్ పెరాలిసిస్ వచ్చాక నిద్ర నుంచి మెళకువ వస్తుంది

health issues with sleep paralysis
స్లీప్ పెరాలిసిస్ వచ్చిన తర్వాత కొన్ని సెకండ్లలోనే మెళకువ వస్తుంది. అప్పుడే అనిపిస్తుంది తనకు ఏదో అయిందని.. తన మీద ఎవరో కూర్చున్నారని.. దెయ్యం వచ్చి కూర్చుందని భయపడుతుంటారు. చాలామంది స్లీప్ పెరాలిసిస్ నే దెయ్యం అనుకుంటారు. అర్థరాత్రి పూట నా మీద వచ్చి దెయ్యం కూర్చుంది.. నేను ఎటూ కదలలేకపోయాను. నా గొంతు కూడా పట్టుకుంది.. అని చాలామంది తెల్లవారాక కథలుగా చెబుతుంటారు. అది దెయ్యం కాదు.. పాడు కాదు.. అది స్లీప్ పెరాలిసిస్. మనుషుల్లో చాలామందికి అది రాత్రి పూట పడుకున్నాక సహజంగా జరిగే ప్రక్రియ. స్లీప్ పెరాలిసిస్ వచ్చినప్పుడు కనీసం ఒక నిమిషం నుంచి నిమిషంనర వరకు ఉంటుంది. అంతకు మించి ఇంకేం లేదు కానీ.. ఈ స్లీప్ పెరాలిసిస్ ను అడ్డంగా పెట్టుకొని దెయ్యాలు పూనాయి.. దెయ్యం పట్టుకుంది అని పల్లెల్లో నమ్మే మూఢనమ్మకాలు మాత్రం ఎక్కువయ్యాయి.