Chicken : చికెన్ ప్రియులకు అలర్ట్… చికెన్ మాంసం ఇలా ఉంటే అస్సలు కొనకూడదు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chicken : చికెన్ ప్రియులకు అలర్ట్… చికెన్ మాంసం ఇలా ఉంటే అస్సలు కొనకూడదు…

 Authored By aruna | The Telugu News | Updated on :27 July 2022,9:45 pm

Chicken : చికెన్ ను చాలామంది ఇష్టపడతారు. మిగతా మాంసాహారాల కంటే చికెన్ ను ప్రేమించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. చికెన్ బిర్యాని నుంచి కర్రీల వరకు ఎన్నో రకాల వంటకాలను ఆరగిస్తుంటారు. అయితే చికెన్ ప్రేమికులు చికెన్ కొనేటప్పుడు పలు విషయాలను తెలుసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. షాపుల్లో మాంసాన్ని కొనేటప్పుడు కొన్ని మోసాలు జరిగే అవకాశం ఉంది. దీంతో చికెన్ ప్రియులు అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. మనం చికెన్ కొనడానికి సూపర్ మార్కెట్లు లేదా చికెన్ సెంటర్ లపై ఆధారపడతాం. ఇది మంచి ఎంపిక అయినప్పటికీ సూపర్ మార్కెట్లలోని చికెన్ లో ఎక్కువ భాగం ప్రాసెస్ చేయబడి లేదా ప్యాక్ చేసి ఉంటుంది. అలాగే చికెన్ సెంటర్లలో కూడా ఎప్పుడో మిగిలిపోయిన చికెన్ ను అమ్ముతారు. ఇలాంటప్పుడు కొన్న చికెన్ తాజాగా ఉందా లేదా అని నిర్ధారించుకోవడం కష్టమే. అయితే కొన్ని చిట్కాలతో కొన్న చికెన్ మంచిదా కాదా అని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఐదు చిట్కాలతో చికెన్ మంచిదా, కాదా అని నిర్ధారించుకోవచ్చు…

1) చికెన్ షాపులో కొన్న చికెన్ ఎక్కువగా ప్యాక్ చేసింది అయి ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టినది అయి ఉంటుంది. అయితే దీన్ని కొనేముందు లేదా వండే ముందు ముట్టుకొని చూస్తే అర్థమవుతుంది. ఇలా ఉన్నప్పుడు చికెన్ ను నీటితో శుభ్రంగా కడగాలి. చికెన్ సహజంగా నిగనిగలాడుతూ లేదా కొంత మెత్తదనాన్ని కలిగి ఉంటుంది. అయితే కడిగిన తర్వాత జిగటగా, మెత్తగా అనిపిస్తే చికెన్ పాడైపోయిందని అర్థం. అలాంటి చికెన్ ను తినకపోవడం మంచిది. 2) తాజా పచ్చి చికెన్ చాలా తేలికపాటి వాసనను కలిగి ఉంటుంది. లేదా అస్సలు వాసన ఉండదు. చెడిపోయిన చికెన్ వాసన కలిగి ఉంటుంది. చికెన్ లో పుల్లని లేదా సల్ఫర్ లాంటి వాసన అది కుళ్ళిన గుడ్లు లాగే వాసన వస్తే దాన్ని పడేయడం మంచిది. చికెన్ వ్యాధికారక క్రిములు అభివృద్ధి చెందడం వలన ఈ చెడువాసన వస్తుంది.

How to check the freshness of raw chicken

How to check the freshness of raw chicken

3) చికెన్ చెడిపోయిందో లేదో తెలుసుకోవడానికి రంగులో మార్పు అనేది సులభమైన మార్గాలలో ఒకటి. తాజాగా కట్ చేసిన చికెన్ ముక్కలు గులాబీ రంగును కలిగి ఉంటాయి. అలాగే నాణ్యతలేని చికెన్ అయితే బూడిద, పసుపు రంగు లేదా లేత రంగులో ఉంటుంది. అలా ఉన్నప్పుడు చికెన్ కొనకూడదు. ఇలా ఉన్న చికెన్ తింటే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. 4) చికెన్ కొనేటప్పుడు లేదా వండేటప్పుడు గుర్తుంచుకోవలసిన మరో విషయం ఏంటంటే చికెన్ పై మచ్చలు ఉన్నాయా లేదా అని చూడడం. పచ్చి చికెన్ కాలక్రమేణా రంగు మారుతుంది. అయితే తెలుపు ఎరుపు, పసుపు రంగులో ముదురు మచ్చలు ఉంటే ఆ చికెన్ చెడిపోయిందని అర్థం.

5) ఫ్రిడ్జ్ లో ఉంచిన చికెన్ అమ్మిన దుకాణం చుట్టూ మంచుతో నిండిన క్రస్ట్ ఉండడం మీరు ఎప్పుడైనా గమనించారా. చికెన్ ఫ్రిడ్జ్ లో ఉంటే దానిలోని తేమను అది కోల్పోతుంది. ఇది చికెన్ నాణ్యత పై ప్రభావం చూపిస్తుంది. అయితే చికెన్ చుట్టూ అసాధారణంగా మందంగా మంచుపొర ఉంటే ఆ చికెన్ అసలు మంచిది కాదు. ఇలాంటి చికెను కొనకుండా ఉండడమే మంచిది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది