Cholesterol Symptoms : ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే కొలెస్టరాల్ టెస్ట్ చేయించుకోండి.. లేదంటే మీరే నష్టపోతారు?
Cholesterol Symptoms : ప్రతి మనిషి శరీరంలో మంచి కొలెస్టరాల్, చెడు కొలెస్టరాల్ ఉంటాయి. ఎంత కొలెస్టరాల్ ఎక్కువగా ఉంటే.. అన్ని వ్యాధులు వచ్చినట్టే. రక్తంలో కొలెస్టరాల్ ఎక్కువగా ఉంటే.. చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. రక్తంలో కొవ్వు ఎక్కువగా ఉన్నవాళ్లకు గుండెజబ్బులు వస్తుంటాయి. కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులు ఇలా రకరకాల సమస్యలు వేధిస్తుంటాయి. వీటన్నింటికి కారణం అధిక కొవ్వు ఉండటమే. అందుకే చాలామంది కొవ్వును కరిగించి.. బరువు తగ్గడానికి వ్యాయామాలు చేస్తుంటారు. ఏది ఏమైనా.. కొలెస్టరాల్ ఎక్కువగా ఉంటే చాలా సమస్యలు చుట్టు ముట్టినట్టే.
కొలెస్టరాల్ అనేది లిపిడ్ ప్రొఫైల్ ను కలిగి ఉంటుంది. ఇది రక్తంలో నుంచి నేరుగా వెళ్లదు. కొవ్వును రక్తంలో నుంచి తీసుకెళ్లడానికి.. లివర్.. లిపో ప్రొటీన్ అనే కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఆ కణాలే కొవ్వును రక్తం గుండా ప్రసరించేలా తోడ్పాటును అందిస్తాయి. అయితే.. సాధారణంగా రక్తంలో ఉండాల్సిన కొవ్వు కంటే ఎక్కువ శాతం ఉంటే మాత్రం అది చాలా డేంజర్. రక్తంలో అధిక కొవ్వు కలిస్తే.. కొన్ని రకాల జబ్బులకు దారి తీస్తుంది. కొన్ని రకాల జబ్బులు వెంట వెంటనే వస్తున్నాయి.. అంటే ఖచ్చితంగా మీ ఒంట్లో అధిక కొవ్వు ఉన్నట్టే. అప్పుడు మీరు ఖచ్చితంగా కొలెస్టరాల్ పరీక్ష చేయించుకోవాలి.
Cholesterol Symptoms : కొలెస్టరాల్ ఎక్కువైతే ఏ జబ్బులు వస్తాయి?
ఒంట్లో కొలెస్టరాల్ ఎక్కువైతే చాలా సమస్యలు వస్తాయి. మీకు గుండె జబ్బులు వచ్చినా.. మెదడుకు సంబంధించిన సమస్యలు వచ్చినా.. ఒంట్లో కొలెస్టరాల్ ఎక్కువైందని భావించాలి. ఎక్కువగా నాన్ వెజ్ తినేవాళ్లు, కొవ్వు పదార్థాలను తీసుకునే వాళ్లలో ఈ సమస్యలు అధికంగా వస్తాయి. ఎక్కువగా కొవ్వు పదార్థాలను తినేవాళ్లు, నాన్ వెజ్ తినేవాళ్లు క్రమం తప్పకుండా కొలెస్టరాల్ టెస్ట్ చేయించుకోవాలి. మీ వయసును బట్టి.. శరీరంలో ఎంత కొలెస్టరాల్ ఉండాలో అంతే స్థాయిలో కొలెస్టరాల్ లేవల్స్ ను మెయిన్ టెన్ చేసుకోవాలి.
ఇది కూడా చదవండి ==> గోధుమ పిండిని ఎక్కువగా వాడుతున్నారా? దాని వల్ల జరిగే నష్టాలు తెలుసుకోకపోతే మీ లైఫ్ డేంజర్ లో ఉన్నట్టే?
ఇది కూడా చదవండి ==> ఎక్కిళ్లు వేధిస్తున్నాయా? వాటిని చిటికెలో ఇలా తగ్గించే చిట్కాలు ఇవే..!
ఇది కూడా చదవండి ==> జుట్టు తీగ వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదలరు..!
ఇది కూడా చదవండి ==> వామును ఇలా తీసుకున్నారంటే.. ఒక్క నెలలోనే 20 కేజీలు తగ్గుతారు..!