Warts Treatment: పులిపిర్లు ఎందుకు వస్తాయి? వాటిని శాశ్వతంగా తొలగించడం ఎలా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Warts Treatment: పులిపిర్లు ఎందుకు వస్తాయి? వాటిని శాశ్వతంగా తొలగించడం ఎలా?

 Authored By jagadesh | The Telugu News | Updated on :22 July 2021,11:08 pm

Warts Treatment : చాలామందిని పులిపిర్లు వేధిస్తుంటాయి. ముఖ్యంగా ముఖం భాగంలో పులిపిర్లు ఏర్పడితే మాత్రం వాళ్ల బాధ వర్ణణాతీతంగా ఉంటుంది. ఎందుకంటే.. పులిపిర్లు అందాన్ని పాడు చేస్తాయి. ముఖం మీద అంద వికారంగా కనిపిస్తాయి. ముఖ్యంగా   అమ్మాయిలైతే పులిపిర్లతో చాలా బాధపడుతుంటారు. కొందరికి ముఖం మీదనే కాదు..   మెడ మీద కూడా వస్తుంటాయి. మెడతో పాటు చేతులు, కాళ్లు.. ఎక్కడ పడితే అక్కడ పులిపిర్లు వస్తుంటాయి. అవి ఎక్కడ, ఎప్పుడు ఎలా పుడుతాయో ఎవ్వరికీ తెలియదు. నిజానికి పులిపిర్లు వచ్చినా..   వాటిని ముట్టుకున్నా.. అక్కడ ఎటువంటి నొప్పి ఉండదు కానీ.. వాటి వల్ల ఇబ్బందులు మాత్రం కలుగుతుంటాయి.

how to get rid of warts health tips telugu

how to get rid of warts health tips telugu

అందుకే.. చాలామంది పులిపిర్లను తొలగించుకోవాలని చూస్తుంటారు. అయితే.. పులిపిర్లు శరీరం మీద ఎందుకు వస్తాయో తెలుసా? శరీరంలో చెమట ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు ఎక్కడైతే శుభ్రత ఉండదో.. ఆ ప్రాంతంలో.. చెమట వల్ల ఓ వైరస్   ఉత్పత్తి అవుతుంది. దాన్నే హ్యూమన్ పాపిలోమా అని అంటారు. అలా.. ఆ వైరస్.. చర్మం మీద పెరుగుతూ.. పెరుగుతూ.. పులిపిరిగా మారుతుంది. అందుకే.. రోజుకు రెండు సార్లు స్నానం చేయాలని పెద్దలు చెబుతుంటారు. శరీరాన్ని   శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతుంటారు.

Warts Treatment : పులిపిర్లు జీవితంలో కూడా రాకుండా ఉండాలంటే ఇలా చేయండి

కొన్ని అవిసె గింజలను తీసుకొని.. వాటిని మొత్తగా రుబ్బి   పేస్ట్ లా చేయండి. ఆ తర్వాత దానికి కాసింత తేనె కలపండి. పులిపిర్లు ఎక్కడైతే ఉన్నాయో.. ఆ మిశ్రమాన్ని రుద్దండి. దాని మీద రుద్దిన తర్వాత.. దాని చుట్టు చిన్న బ్యాండేజ్ వేయండి.   అలాగే.. ఆ బ్యాండేజ్ ను కొన్ని రోజుల పాటు   ఉంచండి. కొన్ని రోజుల తర్వాత ఆ బ్యాండేజ్ ను తీస్తే.. దానితో పాటు.. పులిపిరి కూడా రాలిపోతుంది.

how to get rid of warts health tips telugu

how to get rid of warts health tips telugu

ఒకవేళ మీకు అవిసె గింజలు దొరక్కపోతే.. మన వంటింట్లో ఉండే వెల్లుల్లిని తీసుకోండి. వెల్లుల్లిని పేస్ట్ గా చేసి.. సేమ్ పులిపిర్ల మీద రాయండి. వెల్లుల్లి పేస్ట్ ను రుద్దిన తర్వాత.. దాని మీద బ్యాండేజ్ వేయండి. కొన్ని రోజుల్లోనే పులిపిరి రాలిపోతుంది.

how to get rid of warts health tips telugu

how to get rid of warts health tips telugu

లేదంటే.. ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా చేసుకొని వెనిగర్ లో వేసి.. రాత్రంతా వెనిగర్ లో ఉంచి.. ఉదయం లేచాక.. ఆ వెనిగర్ ను   పులిపిర్ల మీద రుద్దండి. కర్పుర తైలం తీసుకొని.. దాని కూడా పులిపిర్లు ఉన్న చోట రుద్దండి. ఆముదం అందుబాటులో   ఉంటే.. దాన్ని కూడా రుద్దొచ్చు. ఆలు గడ్డ కూడా పులిపిర్లను తొలగిస్తుంది. చిన్న ఆలు గడ్డ ముక్క తీసుకొని.. దాన్ని పులిపిర్ల మీద రుద్దండి. ఇంకా పైనాపిల్ ముక్కను తీసుకొని   పులిపిర్ల మీద రుద్దుండి. లేదా పైనాపిల్ రసాన్ని కూడా   పులిపిర్ల మీద రుద్దితే మంచి ఫలితం ఉంటుంది.

ఇది కూడా చ‌ద‌వండి ==> ఎత్తు పళ్ళు, వంక‌ర పళ్ళు, గోగ్గి పళ్ళు రావడానికి అస‌లు కారణాలు ఇవే..?

ఇది కూడా చ‌ద‌వండి ==> అవిసె గింజలను ఇలా తీసుకుంటే.. నెల రోజుల్లోనే 20 కిలోల వరకు బరువు తగ్గుతారు..!

ఇది కూడా చ‌ద‌వండి ==> షుగర్ తగ్గడానికి ఇంతకన్నా మంచి ఔషధం లేదు.. ఈ పౌడర్ వాడండి.. షుగర్ ను తరిమికొట్టండి..!

ఇది కూడా చ‌ద‌వండి ==> ఇంట్లో చీమలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా చేస్తే మీ ఇంట్లో ఒక్క చీమ కూడా కనిపించదు

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది