Ants Control : ఇంట్లో చీమలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా చేస్తే మీ ఇంట్లో ఒక్క చీమ కూడా కనిపించదు
Ants Control : చాలామంది ఇంటిని నీట్ గా ఉంచుకోవాలనుకుంటారు. ఎటువంటి పురుగులు, బొద్దింకలు, చీమలు రాకుండా చూసుకోవాలనుకుంటారు. కానీ.. చీమల బెడద మాత్రం అందరినీ వేధిస్తుంది. ఎంత శుభ్రంగా ఇంటిని ఉంచుకున్నా.. ఖచ్చితంగా చీమలు మాత్రం ఎక్కడో ఒక చోటు నుంచి వస్తుంటాయి. ముఖ్యంగా ఇంట్లో కిచెన్ లోకి దూరి.. తినే వస్తువుల్లోకి దూరుతాయి. ముఖ్యంగా తియ్యని ఆహార పదార్థాలైతే ఇక చెప్పాల్సిన అవసరమే ఉండదు. వాటి చూపు ఎప్పుడూ తియ్యని ఆహారం మీదనే. చిన్న బెల్లం ముక్క కింద పడ్డా చాలు.. ఎక్కడ దాక్కుంటాయో తెలియదు కానీ.. సెకండ్లలోనే ఆ బెల్లం ముక్క చుట్టూ చేరుతాయి చీమలు.
ఈ చీమల వల్ల ఇంట్లోని మహిళలైతే చాలా చిరాకు పడుతుంటారు. వాటి వల్ల చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. లక్ష్మణ రేఖ.. అంటూ ఏదో చాక్ పీస్ లాంటి దాన్ని తీసుకొచ్చి చీమలు ఉన్న చోట రుద్దినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే.. గుంపులు గుంపులుగా ఇంట్లో దూరి.. ఇబ్బందులకు గురి చేసే చీమల బెడద తప్పదా? వాటి పీడ ఎలా విరగడ చేసుకోవాలి? అనే విషయం తెలియక చాలామంది సతమతమవుతుంటారు. అయితే.. కొన్ని సహజ సిద్ధమైన టిప్స్ ఫాలో అయితే చాలు.. ఇంట్లో చీమల బెడద నుంచి తప్పించుకోవచ్చు.
Ants Control : చీమల బెడద తప్పాలంటే మీరు చేయాల్సిన పని ఇదే
దీని కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. మీ ఇంట్లోనే మీరు చీమల బెడదను తప్పించుకునేందుకు మందు తయారు చేసుకోవచ్చు. దాని కోసం మీకు కావాల్సింది నిమ్మకాయ తొక్క, ఉప్పు, లవంగాలు. నిమ్మకాయ తొక్కను ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని.. దానికి కొంచెం ఉప్పు, లవంగాలు తీసుకొని.. అన్నింటినీ మిక్సీలో వేసి రుబ్బండి. దాని నుంచి వచ్చిన పొడి నుంచి చీమల బెడద నుంచి తప్పించుకోవచ్చు.
నిమ్మకాయ వాసన అంటే చీమలకు అస్సలు పడదు. అందుకే చీమల నుంచి తప్పించుకోవడం కోసం దాన్ని వాడాలి. ప్రతి రోజు ఇంటిని శుభ్రం చేసే సమయంలో.. ఈ పొడిని నీటిలో వేసి.. ఇల్లు అంతా తుడవండి. ఆ తర్వాత.. ఒక స్ప్రే బాటిల్ తీసుకొని.. దాంట్లో కాసింత ఈ పౌడర్ వేసుకొని.. నీళ్లు పోసి.. ఎక్కడ చీమలు కనిపిస్తే అక్కడ స్ప్రే చేస్తే చీమలు వెంటనే చనిపోతాయి. ఇక.. జన్మలో కూడా చీమలు మీ జోలికి రావు.
ఇది కూడా చదవండి ==> కోతుల నుంచి మనుషులకు సోకుతున్న కొత్త వైరస్.. ఇది కరోనా కన్నా డేంజర్?
ఇది కూడా చదవండి ==> నెయ్యి గురించి ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.. నెయ్యి తినడం వల్ల శరీరంలో ఏం జరుగుతుందంటే?
ఇది కూడా చదవండి ==> మీ ఇంట్లోనే యాపిల్ చెట్టును పెంచుకోవచ్చు.. ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు..!
ఇది కూడా చదవండి ==> గోధుమ గడ్డి జ్యూస్ ఎప్పుడైనా తాగారా? చాలా అనారోగ్య సమస్యలు నయం అవుతాయి..!