Ayurveda Tips : రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి బెస్ట్ ఆయుర్వేదం టిప్స్ ఇవే..!
Ayurvedic Tips : ప్రస్తుతం మానవాళి చాలా సమస్యల్లో చిక్కుకుంది. కరోనా కోరల్లో చిక్కుకుపోయింది. కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్ అంటూ తన ప్రతాపాన్ని ప్రజల మీద చూపిస్తోంది. దానికి చెక్ పెట్టేందుకు మనం చేయాల్సింది ఒక్కటే రోగ నిరోధక శక్తి(Immunity system) ని పెంచుకోవడం. అప్పుడే కరోనా కాదు కదా.. దాన్ని తాత మహమ్మారి కూడా మన దరిచేరదు. కానీ.. ఇమ్యూనిటీ సిస్టమ్ ను ఎలా పెంచుకోవాలి. దాని కోసం ఏం తినాలి? అనేది చాలా మందికి తెలియదు. మన శరీరానికి కావాల్సినంత రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి మనం చేయాల్సింది ఒక్కటే ఆయుర్వేదాన్ని ఫాలో అయిపోవడమే. ఇప్పుడు ఆయుర్వేదం ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. ఏకంగా కరోనాకే చెక్ పెట్టే మందును ఆయుర్వేదంలో కనిపెట్టారు అంటే.. ఆయుర్వేదం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. అందుకే.. ఎటువంటి రోగాన్నయినా నయం చేయాలన్నా.. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలన్నా.. మనం ఖచ్చితంగా ఈ ఆయుర్వేదం టిప్స్ ను ఫాలో అవ్వాల్సిందే.
ఉదయాన్నే లేవగానే వేడి నీళ్లు లేదా గోరు వెచ్చని నీళ్లను తాగాలి. దాని వల్ల.. ముందు శరీరంలో ఉన్న ఎన్నో మలినాలు, వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి. అది కూడా పరిగడుపున గోరు వెచ్చని నీళ్లను ఒక గ్లాస్ తాగాలి. క్రమం తప్పకుండా ప్రతి రోజు గోరు వెచ్చని నీళ్లను తాగాలి. అలాగే.. ఉదయం పూట రోజూ కనీసం ఒక 30 నిమిషాల పాటు యోగ, ప్రాణయామం లాంటివి చేయాలి. మెడిటేషన్ కూడా శరీరానికి ఎంతో మంచిది. మనం వండుకునే వంటల్లో ఎక్కువగా పసుపు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, అల్లంను ఎక్కువగా ఉపయోగించాలి. ఇవి శరీరంలో ఉన్న ఎటువంటి వ్యాధులను అయినా నయం చేసే శక్తిని కలిగి ఉంటాయి. అలాగే.. రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదపడతాయి.
Ayurveda Tips : రోజూ పసుపు పాలు తాగాలి
చాలామంది పాలలో చక్కెర వేసుకొని తాగుతారు కానీ.. పాలల్లో ఇంత పసుపు వేసుకొని తాగండి. రోజుకు రెండు పూటల ఇలా పసుపు పాలను తాగితే ఎంతో మంచిది. అలగే.. తులసీ ఆకులు, దాల్చిన చెక్క, మిరియాలు, సొంఠితో చేసిన హెర్బల్ టీని తాగండి. రోజుకు రెండు సార్లు వాటితో చేసిన టీని తాగండి. ఆ టీలో కాసింత బెల్లం, నిమ్మరసం కలుపుకోండి. టేస్ట్ అదిరిపోతుంది. లవంగాలను పొడి చేసుకొని.. కొన్ని నీళ్లలో వేసి.. దాంట్లో ఇంత చక్కెర, తేనె కలుపుకొని తాగండి. ఎటువంటి దగ్గు అయినా.. గొంతు నొప్పి అయినా వెంటనే మటాష్ అవ్వాల్సిందే. ఈ ఆయుర్వేద టిప్స్ ను పాటిస్తే.. ఎటువంటి జలుబు, దగ్గు, కఫం, జ్వరం లాంటి సమస్యలు రావు. అలాగే.. శరీరంలో కావాల్సినంత రోగనిరోధక శక్తి పెరుగుతుంది.