IPl 2022 : ఐపీఎల్ ధ‌నాధ‌న్ ఎప్పుడు మొద‌లు కానుంది అంటే.. ఇక క్రికెట్ ప్రేమిల‌కి పండ‌గే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

IPl 2022 : ఐపీఎల్ ధ‌నాధ‌న్ ఎప్పుడు మొద‌లు కానుంది అంటే.. ఇక క్రికెట్ ప్రేమిల‌కి పండ‌గే..!

IPl 2022 : ఐపీఎల్ హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటీవ‌ల మెగా వేలం జ‌ర‌గ‌గా, త్వ‌ర‌లోనే మ్యాచ్‌లు ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తుంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాయి. మరో వైపు ఈ లక్నో, అహ్మదాబాద్ రూపంలో కొత్త జట్లు రావడంతో ఈ ఏడాది సీజన్‌ మరింత రసవత్తరంగా జరగనుంది. ఇక ఐపీఎల్‌-2022 షెడ్యూల్‌ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదరు చూస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :24 February 2022,1:00 pm

IPl 2022 : ఐపీఎల్ హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటీవ‌ల మెగా వేలం జ‌ర‌గ‌గా, త్వ‌ర‌లోనే మ్యాచ్‌లు ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తుంది. మొత్తం 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాయి. మరో వైపు ఈ లక్నో, అహ్మదాబాద్ రూపంలో కొత్త జట్లు రావడంతో ఈ ఏడాది సీజన్‌ మరింత రసవత్తరంగా జరగనుంది. ఇక ఐపీఎల్‌-2022 షెడ్యూల్‌ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదరు చూస్తున్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ మార్చి 27 నుంచి ప్రారంభం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది అన్ని ఐపీఎల్‌ మ్యాచ్‌లు అహ్మదాబాద్, ముంబై, పూణేలోని 6 స్టేడియాల్లో జరిగే అవకాశం ఉంది.

మ్యాచ్‌లు మహరాష్ట్రలోని వాంఖడే, బ్రబౌర్న్, డాక్టర్ డివై పాటిల్, రిలయన్స్ జియో స్టేడియాల్లో జరిగే ఛాన్స్‌ ఉంది. కాగా ఇప్పటికే ఈ స్టేడియాలను ముంబై క్రికెట్‌ ఆసోసియేషన్‌ సిద్దం చేసినట్లు వినికిడి. అదే విధంగా ఒక వేళ మార్చి 26న టోర్నీ ప్రారంభమైతే.. ప్రసారం చేయడానికి బ్రాడ్‌కాస్టర్ డిస్నీ స్టార్ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్–2022లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్న కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ తమ లోగోను ఆదివారం రివీల్ చేసింది. మిగతా ఫ్రాంచైజీలకు భిన్నంగా మెటావర్స్‌‌‌‌ (వర్చువల్ స్పేస్)​లో ‘ది టైటాన్స్​ డగౌట్’ పేరుతో లోగోను రిలీజ్ చేశారు. ఇందులో టీమ్ కోచ్ ఆశిష్ నెహ్రా, కెప్టెన్ హార్దిక్, శుభ్ మన్ గిల్ కనిపించారు.

ipl 2022 new schedule

ipl 2022 new schedule

IPl 2022 : ఐపీఎల్ స‌మ‌రం ఎప్పుడు..

శ్రీలంకతో టెస్ట్ సిరీస్ మార్చి 16న పూర్తవుతుంది కాబట్టి లీగ్‌ను ఒక రోజు ముందుకు జరపడం వల్ల భారత ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, దీనివల్ల ఆస్ట్రేలియా ప్లేయర్లు మాత్రం లీగ్‌లో మరో మ్యాచ్‌ను మిస్సయ్యే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ పర్యటన ఉన్న నేపథ్యంలో వారంతా ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఏప్రిల్ 6 తర్వాతే మ్యాచ్‌లకు అందుబాటులోకి రానున్నారు. వెస్టిండీస్, ఇంగ్లండ్ మధ్య సిరీస్‌ల నేపథ్యంలో ఈ రెండు దేశాల ఆటగాళ్లు ఏప్రిల్ 5న అందుబాటులోకి రానున్నారు. ఈ ప్రతిపాదనపై బీసీసీఐ చర్చలు జరుపుతుంది. బోర్డు కూడా ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తొంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మార్చి 26నే లీగ్ ప్రారంభం కానుంది’అని ఓ ఫ్రాంచైజీ అధికారి తెలిపారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది