Janaki Kalaganaledu 5 Nov Today Episode : మరిన్ని చిక్కుల్లో పడబోతున్న జానకి జీవితం.. పోలేరమ్మను మించిన మహంకాళిని కలిసిన జానకి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Janaki Kalaganaledu 5 Nov Today Episode : మరిన్ని చిక్కుల్లో పడబోతున్న జానకి జీవితం.. పోలేరమ్మను మించిన మహంకాళిని కలిసిన జానకి

 Authored By gatla | The Telugu News | Updated on :5 November 2021,10:40 am

Janaki Kalaganaledu 5 Nov Today Episode : జానకి కలగనలేదు సీరియల్ ఈరోజు ఎఫిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 5 నవంబర్, 2021 శుక్రవారం ఎపిసోడ్ 165 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శ్రావణి మాట్లాడిన మాటలు.. తనవి కావు. అవి నీవి. నువ్వే తనతో ఇలా మాట్లాడించావు అని జ్ఞానాంబ అంటుంది. నీకు 15 రోజుల సమయం ఇచ్చాను కానీ.. ఈరోజే నువ్వు తప్పు చేశావు.. అంటుంది. అత్తయ్య గారు శ్రావణి మాటలకు, నాకు సంబంధం లేదు. తన మాటలకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెబుతుంది జానకి. దీంతో చూస్తాను… ఈ 14 రోజుల్లో ఒక్కరోజు అయినా ఈ పిల్ల మాట్లాడిన మాటల్లో నువ్వు ఒక్కటైనా మాట్లాడవా చూస్తాను అని చెప్పి జ్ఞానాంబ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. రామా కూడా కొట్టుకు వెళ్లిపోతాడు.

janaki kalaganaledu 5 november 2021 full episode

janaki kalaganaledu 5 november 2021 full episode

శ్రావణి అన్న మాటలనే తలుచుకుంటాడు రామా. నిజంగానే నన్ను చేసుకోవడం వల్ల జానకి తన జీవితాన్ని కోల్పోయిందా అని బాధపడతాడు. ఇంతలో జానకి అక్కడికి వస్తుంది. రామా గారు నిజంగా నేను శ్రావణిని పిలవలేదు అంటుంది. నా భార్య ఏంటో.. నా భార్య మనసు ఏంటో నాకు తెలుసు అంటాడు రామా. నా మీద మీకు ఎలాంటి కోపం లేదా అంటుంది జానకి. మరి ఎందుకు నా మాట వినిపించుకోకుండా ఎందుకు వచ్చేశారు అని అడుగుతుంది. దీంతో ఏం లేదు లేండి అంటాడు రామా.

నా బాధ మీ గురించేనండి అంటాడు. శ్రావణి అమ్మ గురించి అలా అనడం తప్పే కానీ.. మీరు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే శ్రావణి చెప్పినట్టు ఏ ఇంజినీర్ నో… ఏ లాయర్ నో చేసుకొని గొప్పగా బతికేవారు. మీ కన్నీళ్లను మీరు ఎదుర్కొంటున్న పరీక్షలను చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తోందండి. ఈ స్వీటు కొట్టేడిని కట్టుకోవడం వల్లనే కదా మీకు ఈ బాధలు అంటాడు రామా.

వద్దండి… అలా మాట్లాడకండి. మీ ప్రేమ, ఓదార్పే నన్ను ఎన్నో బాధల నుంచి విముక్తిని చేశాయి. మీరు నా జీవితంలోకి రాకపోయి ఉంటే.. ఈ జానకి ఎలా ఉండేదో.. అసలు ఉండేదో లేదో కూడా తెలియదు అని అంటుంది జానకి. మీరు ఇందాక ఒక మాట చెప్పారు కదా.. ఒక్కమాట నేను చెబుతాను. మిమ్మల్ని చేసుకోకపోయి ఉంటే దేవుడి లాంటి మంచి భర్తను.. బంగారం లాంటి జీవితాన్ని కోల్పోయి ఉండేదాన్ని అంటుంది జానకి.

Janaki Kalaganaledu 5 Nov Today Episode : జ్ఞానాంబకు మంచి పరిష్కారం చెప్పిన గోవిందరాజు

మరోవైపు జ్ఞానాంబ.. జానకి గురించే ఆలోచిస్తుంటుంది. గోవిందరాజు ఇంతలో వస్తాడు. అసలు నువ్వు జానకిని ఈ 15 రోజుల్లో ఎలా టెస్ట్ చేస్తావు.. అని అడుగుతాడు. నాకు కూడా ఏం అర్థం కావడం లేదండి అంటుంది జ్ఞానాంబ. ఈ సమస్యకు పరిష్కారం నాకు కూడా తెలియట్లేదు అంటుంది. మా అమ్మ మైరావతి అయితేనే కరెక్ట్ అంటాడు గోవిందరాజు. మా అమ్మ కూడా నీకంటే ఎక్కువ సంప్రదాయాలను పాటిస్తుంది. జానకిని తీసుకెళ్లి మా అమ్మ దగ్గరికి వెళ్దాం. 15 రోజులు జానకిని అక్కడే ఉంచుదాం. అప్పుడు జానకిని అమ్మ గమనిస్తుంది. తను చెబుతుంది అనగానే సరే అంటుంది జ్ఞానాంబ. వెంటనే ఫోన్ చేసి మాట్లాడుతుంది జ్ఞానాంబ. అన్ని విషయాలు చెబుతుంది. ఎల్లుండి దీపావళి, నోములు.. ఆ పిల్లను తీసుకొని ఇక్కడికి రండి. ఆ పిల్ల సంగతి నేను తేల్చేస్తా అంటుంది మైరావతి. దీంతో సరే అంటుంది జ్ఞానాంబ.

janaki kalaganaledu 5 november 2021 full episode

janaki kalaganaledu 5 november 2021 full episode

ఇవన్నీ విన్న మల్లిక.. వెంటనే జానకి దగ్గరికి వచ్చి అన్ని విషయాలు చెప్పేస్తుంది. దీంతో జానకి కూడా భయపడుతుంది. తన మాటే శాసనం అంటుంది  మల్లిక. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది