TGSRTC Jobs : త్వరలో TGSRTC లో 3 వేల 38 పోస్టులకు నోటిఫికేషన్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TGSRTC Jobs : త్వరలో TGSRTC లో 3 వేల 38 పోస్టులకు నోటిఫికేషన్..!

 Authored By ramu | The Telugu News | Updated on :21 April 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  TGSRTC Jobs : త్వరలో TGSRTC లో 3 వేల 38 పోస్టులకు నోటిఫికేషన్..!

TGSRTC Jobs  తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్ . త్వరలోనే RTCలో 3,038 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కొత్త బస్సుల కొనుగోలు ప్రక్రియ పూర్తయిన వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.

TGSRTC Jobs త్వరలో TGSRTC లో 3 వేల 38 పోస్టులకు నోటిఫికేషన్

TGSRTC Jobs : త్వరలో TGSRTC లో 3 వేల 38 పోస్టులకు నోటిఫికేషన్..!

TGSRTC Jobs  : తెలంగాణ RTCలో 3,038 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ – మంత్రి పొన్నం ప్రకటన

ఈ నియామక ప్రక్రియలో భాగంగా 2,000 డ్రైవర్‌ పోస్టులు ప్రధానంగా ఉండనున్నాయి. వాటితో పాటు 743 శ్రామిక్‌ పోస్టులు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్), 114 డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్), 25 డిపో మేనేజర్‌/అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌, 18 అసిస్టెంట్‌ మెకానికల్‌ ఇంజినీర్‌, 23 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (సివిల్‌), 11 సెక్షన్‌ ఆఫీసర్‌ (సివిల్‌), 6 అకౌంట్‌ ఆఫీసర్లు, 7 మెడికల్‌ ఆఫీసర్లు (జనరల్‌), 7 మెడికల్‌ ఆఫీసర్లు (స్పెషలిస్ట్‌) పోస్టులు ఉన్నాయి.

ఈ నోటిఫికేషన్‌తో రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. ముఖ్యంగా డ్రైవింగ్, టెక్నికల్, ఇంజినీరింగ్, వైద్య విభాగాలలో విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా మారనుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ నిరుద్యోగులకు పిలుపునిస్తూ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, త్వరలో పూర్తి వివరాలతో నోటిఫికేషన్ విడుదల కానుందని తెలియజేశారు.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది