Vishnupuri Colony : మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై నివాసితుల ఆవేదన .. విష్ణుపురి కాలనీ
ప్రధానాంశాలు:
Vishnupuri Colony : మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై నివాసితుల ఆవేదన .. విష్ణుపురి కాలనీ
Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు గురవుతూ, కాలనీ ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టి వేస్తోంది. వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించి ప్రజల జీవన విధానాన్ని ఇబ్బందులకు గురిచేస్తోంది.

Vishnupuri Colony : మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై నివాసితుల ఆవేదన .. విష్ణుపురి కాలనీ
Vishnupuri Colony కార్పొరేషన్ లోని ముంపు ప్రాంత కాలనీలలో వర్షాకాలం రాకముందే వరదలు రాకుండా అన్ని పనులు పూర్తి చేయాలి : తుంగతుర్తి రవి
కాలనీ నివాసితులు ఇప్పటికే పలు మార్లు మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదులు చేసినప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యక్ష చర్యలు చేపట్టకపోవడంతో వారు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, విష్ణుపురి కాలనీ ప్రెసిడెంట్ అమర్నాథ్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు, మహిళలు, స్థానిక నాయకులు, వివిధ పార్టీలకు సంబందించిన నాయకులు,మున్సిపల్ కార్యాలయంలో ప్రజావాణిలో పాల్గొని సంబంధిత అధికారులకు సమస్యను మరోసారి వివరించారు.
ఈ అంశంపై పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి స్పందిస్తూ, “వర్షాకాలానికి ముందే సంబంధిత పనులను పూర్తి చేసి, కాలనీ ప్రజలు మళ్లీ వరద ముప్పుకు గురికాకుండా చూడాలి. అధికారులు బాధ్యతగా స్పందించాలి” అని అన్నారు. ప్రజల కష్టాలను నిర్లక్ష్యం చేయకూడదని, వెంటనే పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన హితవు పలికారు.ప్రజలు ఇప్పుడు అధికారుల వెంటనే స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. వారి ప్రాథమిక హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం తక్షణం అవసరం అన్నారు.