Uttar Pradesh News : ఉత్తరప్రదేశ్ లో రామాయణం కాలం నాటి పక్షి దర్శనం పోటెత్తుతున్న ప్రజలు.. వీడియో
Uttar Pradesh News ; ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రామాయణంలో జటాయువు లాంటి పక్షి దర్శనమిచ్చింది. ఈ పక్షిని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా… పక్షి విహరించే ప్రాంతాలలో వెళ్తున్నారు. ఉత్తర ప్రదేశ్ కాన్పూర్ ప్రాంతంలో ఈ పక్షి దాదాపు వారం రోజుల నుండి పది రోజులు పాటు అక్కడే ఉంటున్నట్లు స్థానికులు తెలియజేస్తున్నారు. అయితే అయోధ్యలో రామాలయం చూడటానికి ఈ పక్షి వచ్చిందని..జటాయువుతో పోలుస్తూ భక్తులు కామెంట్లు చేస్తున్నారు. కాన్పూర్‌లోని బెనాజ్ హబర్ ప్రాంతంలోని ఈద్గా సమీపంలో స్థానికులకు ఈ అరుదైన పక్షి కనిపించింది. ఎగరలేక అలాగే ఉండటంతో
పక్షి మరీ భయంకరమైన ఆకారంలో ఉండటంతో మొదట పట్టుకోడానికి చాలామంది జనం భయపడ్డారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. వారు వెంటనే వచ్చి ఆ భారీ పక్షిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇది హిమాలయన్ జాతికి చెందిన రాబందు అనీ తెలియజేశారు. దీని ఎత్తు 5 అడుగులు ఉంది. రెక్కలు ఆరడుగుల పొడవు ఉన్నాయి. 8 కేజీల బరువు ఉంది. అయితే వయసు చాలా ఎక్కువగా ఉండొచ్చని అందువల్లే దానికి ఓపిక ఉండకపోవచ్చు అని అధికారులు తెలియజేశారు.
ఈ రకమైన రాబందులు హిమాలయాలతో పాటు టిబెట్ పీఠభూమి ప్రాంతంలోనూ కనిపిస్తాయని తెలిపారు. ఇక ఇదే సమయంలో ఇటువంటి పక్షి మరొకటి అదే ప్రాంతంలో సంచరిస్తున్నట్లు అధికారులకు స్థానికులు తెలియజేశారు. దీంతో ఆ పక్షిని కూడా పట్టుకోవడానికి అతిపెద్ద అధికారులు చర్యలు చేపట్టారు. ఇక పట్టుబడ్డ ఆ పెద్ద రాబందుని… స్థానిక జూపార్కులో.. ఉంచి పరిశీలిస్తున్నారు. అయితే ఈ పెద్ద రాబందు రాక మరోపక్క యూపీలో అయోధ్య రామాలయం నిర్మాణం జరుగుతూ ఉండటంతో జటాయువుతో పోలిస్తూ.. స్థానికులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
Jatayu Bhagwaan ke vanshaj Uttarpradesh me Ram Mandir darshan hetu padhare pic.twitter.com/Cz83VDisVA
— Maa Ka Ashirwaad (@nirajkolkata) January 9, 2023