kalvakuntla kavitha : కేసీఆర్ కూతురు అంటే ఆ మాత్రం ఉండాలి కదా.. మళ్లీ కవిత జోరు షురూ..?
నామినేటేడ్ పదవులైన, పార్టీ పదవులైన కావాలంటే ఎమ్మెల్సీ కవితను కలవాల్సిందేనని టాక్ వినిపిస్తోంది. తాజాగా నిజామాబాద్ రూరల్ ఎమ్మేల్యే బాజిరెడ్డి గోవర్దన్ కు ఆర్టీసీ చైర్మన్ పదవి వచ్చిందంటే అది కేవలం కవిత వల్లే అని జిల్లాలో చర్చించుకుంటున్నారు.. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అధికార పార్టీ నేతలు ఎమ్మెల్సీ కవిత మద్దతు కోసం క్యూ కడుతున్నారు.. జిల్లాలో పార్టీ సంస్థాగత పదవులతో పాటు ఇతర పదవులు ఆమె చెప్పినవారికి దక్కుతున్నాయని కేడర్ చర్చించుకుంటోంది.
సీఎం కేసీఆర్ తనయగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యురాలుగా కల్వకుంట్ల కవిత ప్రాతినిధ్యం వహిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. అయితే ఆ తర్వాత 2019లో ఓటమి పాలయ్యారు.. దీంతో కోద్ది రోజుల పాటు రాజకీయాలకు జిల్లాకు దూరంగా ఉన్నారు. అనంతరం 2020లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించారు. దీంతో ఆప్పటి నుంచి జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారారు..
పదవుల భర్తీలో చక్రం kalvakuntla kavitha
అప్పటి నుండి కవిత మరోసారి జిల్లాలో చక్రం తిప్పుతున్నారని టాక్ వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలోనే స్థానిక నేతలు సైతం పార్లమెంట్ పరిధిలోని ఉమ్మడి జిల్లాలో ఎలాంటి పార్టీ పదవులైన, నామినేటేడ్ పదవుల ఆశావహులు, మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు అండదండలు ఉన్నా కవిత ఆనుగ్రహం లేనిదే వరించదనే పరిస్థితి మరోసారి తీసుకువచ్చారు. తాజాగా ఉమ్మడి జిల్లాలో రెండు జిల్లాల అధ్యక్ష పదవుల భర్తీ ఉంది.. అయితే ఆ పదవుల ఎవరికి దక్కుతాయనే విషయం పై చర్చ జరుగుతోంది. అయితే కవిత చెప్పిన వారికే అధ్యక్ష పదవులు దక్కుతాయని ప్రచారం జోరందుకుంది.. దీంతో టిఆర్ఎస్ లో సంస్థాగత, అధికార పదవుల భర్తీ చుట్టూ జరుగుతున్న రాజకీయాలకు ఎమ్మెల్సీ కవిత కేంద్ర బిందువు గా మారారు.
కవిత చుట్టూ ప్రదక్షిణలు kalvakuntla kavitha
దీంతో ఆమెను మరోసారి ప్రసన్నం చేసుకోవడం కోసం నేతలు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. దీంతో జిల్లా రాజకీయాల్లో మరోసారి సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా ఎమ్మెల్సీ కవిత మారారు. ఇటీవల అమెరికా పర్యటన ముగించుకొని వచ్చిన ఆమె హైదరాబాద్ నుండే చక్రం తిప్పుతున్నట్టు తెలుస్తోంది.. ఆర్టీసీ చైర్మన్ పదవిని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కు ఖరారు చేయడం వెనుక ఆమె పాత్ర ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో జిల్లాకు చెందిన నేతలు పార్టీ జిల్లా అద్యక్ష పదవుల కోసం ఎమ్మెల్సీ కవితతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జిల్లా అధ్యక్ష పదవులతోపాటు అద్యక్ష నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను ఆశిస్తున్న వారు కూడా కవిత చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.. దీంతో పదవులు ఎవరికి దక్కినా కవిత ఆమోదం ఖాయమనే టాక్ నడుస్తోంది.