YS Sharmila : షర్మిలను వాళ్లు ముఖ్యమంత్రిని చేస్తారు? కీలక వ్యాఖ్యలు చేసిన రచయిత?
YS Sharmila : తెలంగాణలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక తర్వాత మళ్లీ అంత ట్రెండింగ్ అవుతున్న టాపిక్.. షర్మిల పార్టీ. అసలు.. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టబోతున్నారు అనేదే చాలా హాట్ టాపిక్. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించాక… తెలంగాణ రాజకీయాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. షర్మిల కూడా తన దూకుడును ప్రారంభించారు. తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. లోటస్ పాండ్ వేదికగా పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన షర్మిల… తర్వా ఖమ్మం సభలో సమర శంఖారావం పూరించారు. తనను ఆశీర్వదించాలని ప్రతి తెలంగాణ పౌరుడిని కోరారు. తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలని… తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను నిలదీయాలని.. అందుకే పార్టీ పెడుతున్నట్టు ఆమె ప్రకటించారు. త్వరలోనే ఆమె పార్టీ పేరు, పార్టీ విధివిధానాలను ప్రకటించనున్నారు.
తన ఖమ్మం సభలో షర్మిల ప్రధానంగా తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల గురించే మాట్లాడారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను సీఎం కేసీఆర్ మోసం చేశారని చెప్పారు. అందుకే కేసీఆర్ ను నిలదీసేందుకే పార్టీ పెడుతున్నట్టు షర్మిల తెలిపారు. అలాగే… ప్రభుత్వ ఉద్యోగాల గురించి కూడా షర్మిల నిలదీశారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఇంట్లో ఎవరు ఒకరు ఆత్మహత్య చేసుకోవాల్సిందేనా అని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగ నియామకాల కోసం… తాను సంకల్ప దీక్ష చేపడతానని షర్మిల… ఖమ్మం సభలోనే మాటిచ్చారు.
YS Sharmila : వైఎస్ షర్మిలకు మద్దతు పలికిన రచయిత కంచె ఐలయ్య
షర్మిల మాటిచ్చినట్టుగానే తాజాగా హైదరాబాద్ లో ఉద్యోగ దీక్షను చేపట్టారు. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న సుమారు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ షర్మిల డిమాండ్ చేశారు. అయితే షర్మిల 72 గంటల పాటు నిరాహార దీక్షను చేపట్టగా… పోలీసులు మాత్రం తనకు ఒక్క రోజే దీక్ష చేసేందుకు అనుమతి ఇచ్చారు. షర్మిలకు.. రచయిత కంచె ఐలయ్య తన మద్దతును ప్రకటించారు. కాకతీయ గడ్డ మీద పుట్టిన రుద్రమ దేవి తర్వాత ఇప్పుడు షర్మిలను చూస్తున్నానంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
షర్మిలకు తెలంగాణ గడ్డ మీద పార్టీ పెట్టే హక్కు ఉంది. షర్మిల.. సమ్మక్క, సారలమ్మ వారసురాలు. తెలంగాణ మహిళలే షర్మిలను ముఖ్యమంత్రిని చేస్తారు…. అంటూ కంచె ఐలయ్య స్పష్టం చేశారు. ఈసందర్భంగా కంచె ఐలయ్య… వైఎస్సార్ ను గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ పాలనలో విద్యా రంగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.