Hit 3 : హిట్ 3 పూర్తి చేసిన కార్తి.. హిట్ 4లో కూడా ప్రత్యేక రోల్..!
ప్రధానాంశాలు:
Hit 3 : హిట్ 3 పూర్తి చేసిన కార్తి.. హిట్ 4లో కూడా ప్రత్యేక రోల్..!
Hit 3 : అగ్ర కథానాయకుడు నాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం హిట్ 3. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ హిట్ నుంచి వస్తున్న 3వ చిత్రంలో నాని కథానాయకుడిగా నటించడంతో పాటు నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. శైలేశ్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా.. మే 01న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త వైరల్‌గా మారింది.

Hit 3 : హిట్ 3 పూర్తి చేసిన కార్తి.. హిట్ 4లో కూడా ప్రత్యేక రోల్..!
Hit 3 : కార్తి దంచేస్తాడు..
ఈ సినిమాలో తమిళ నటుడు కార్తీ అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. కొందరు ఏమో కార్తీ నానితో కలిసి కనిపిస్తాడని ప్రచారం చేస్తుండగా.. మరికొందరు కార్తీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించవచ్చని అంటున్నారు. హిట్ 2 క్లైమాక్స్ లాగానే “హిట్ 3” క్లైమాక్స్ లో కొత్త హీరో ఎంట్రీ ఇస్తాడని ఆ హీరో పాత్రలోనే కార్తీ రాబోతున్నాడని.. ఇది “హిట్ 4” కి లీడ్ ఇస్తుందని కూడా టాక్ నడుస్తుంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హిట్ 3 సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ స్పెషల్ రోల్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కార్తీ పాత్ర చాలా కీలకంగా ఉండనుందని.. నాని-కార్తీ కాంబోలో వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ గా ఉంటాయని అంటున్నారు. కార్తీ పోషించబోయే పాత్ర ‘హిట్-4’ మూవీ కొనసాగింపుగా, అందులో హీరోగా ఉండబోతుందని సమాచారం. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ తవరలోనే రానున్నట్లు సమాచారం. కాగా, హిట్ ఫ్రాంచైజీలో భాగంగా ఇంతకుముందు యువ హీరోలు విష్వక్ సేన్ ‘హిట్’, అడివి శేష్ ‘హిట్ 2’లో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి.