Teenmar Mallanna : తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై జాగృతి కార్యకర్తల దాడి.. కారణం కవిత పై ఆ వ్యాఖ్యలు చేయడమే
Teenmar Mallanna : తెలంగాణలో రాజకీయ దుమారం మళ్లీ భగ్గుమంది. ఇటీవల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. తెలంగాణ శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితపై అనుచితంగా వ్యాఖ్యానించారని ఆరోపిస్తూ, జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మేడిపల్లిలో ఉన్న తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూ న్యూస్ కార్యాలయం పై దాడికి దిగారు. “జై కవితక్క” అంటూ నినాదాలు చేస్తూ, కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నీచర్, కిటికీలు ధ్వంసం చేశారు.
ఈ ఘటనలో ఉద్రిక్తత మరింత పెరగడంతో మల్లన్న గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపాడు. దీనితో అక్కడ పరిస్థితి పూర్తిగా ఉద్రిక్తంగా మారింది. కార్యాలయ సిబ్బంది నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేసినా వారు ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ దాడిలో ఇరుపార్టీలకు చెందిన కొంతమంది గాయపడినట్టు తెలుస్తోంది. అలాగే కార్యాలయంలో రక్తపు మరకలు కనిపించడం గాయాల తీవ్రతను సూచిస్తోంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని జాగృతి కార్యకర్తలపై అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

Teenmar Mallanna : తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై జాగృతి కార్యకర్తల దాడి.. కారణం కవిత పై ఆ వ్యాఖ్యలు చేయడమే
ఇక తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. “BCలకు 42% రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తెస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయినా కవిత ఎందుకు పండగ చేసుకుంటోంది? ఆమెకు BCలతో ఎలాంటి సంబంధం ఉంది? నువ్వు BCనా? నువ్వు కంచం పొత్తుతో వచ్చావా? మం** పొత్తు ఉందా?” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవే వ్యాఖ్యలు తెలంగాణ జాగృతి కార్యకర్తల కోపాన్ని రాజేశాయి. ఆ వ్యాఖ్యలే మల్లన్న ఆఫీస్ పై దాడి చేసేలా చేశాయని తెలుస్తుంది.