Madagascar : ఆకలి తీరటం కోసం చింతపండుతో మట్టిని కలిపి తింటున్నారు.. షాకింగ్ నిజాలు
Madagascar : పాలకుల చేతకానితనం ఆ దేశ ప్రజలకు ఎంతటి దారుణమైన పరిస్థితులు కల్పిస్తాయో చెప్పటానికి ఒక ఉదాహరణ మాడగాస్కర్. ప్రస్తుతం ఆ దేశం ఆకలితో అల్లాడిపోతోంది. సౌత్ మాడగాస్కర్ లో సరిగ్గా తినటానికి తిండిలేక ప్రజలు మట్టిని చింతపండుతో కలిపి తింటున్నారు. ఒక మట్టి ముద్దను కష్టంగా పొట్టలోని నెట్టి, నీళ్లు తాగి రోజులు గడుపుతున్నారు.

Madagascar : eating mud mixed with tamarind to satisfy hunger shocking facts
అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఒక్క పూట ఆహారం కోసం ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీసే స్థితికి చేరుకున్నారనే చెప్పాలి. గ్రాండ్ సూట్ గా పిలుచుకునే సౌత్ మాడగాస్కర్ లో దాదాపు ఏడున్నర లక్షల మంది ఈ దారుణమైన సమస్యలను ఎదుర్కుంటున్నారు. గత రెండు మూడేళ్ళ నుండి ఈ పరిస్థితి మరింత విషమించింది. ఈ ప్రాంతంలో రాజకీయ స్థిరత్వం కొరవడటంతో అభివృద్ధి అనేది కుంటుపడింది. దీనితో అక్కడి ప్రజలు తీవ్ర పేదరికంలో కూరుకుపోయారు.
Madagascar : మరి ఇంత దారుణమా
మాడగాస్కర్ లో దాదాపు 76 % మంది ప్రజలు ఈ కరువులో అల్లాడిపోతున్నారు. తుఫాన్లు, విపత్తులు వంటి వాటి వలన కూడా ఈ పరిస్థితులు వచ్చాయి. గత 30 ఏళ్ళల్లో 50 శాతం ప్రకృతి విపత్తులు తలెత్తటం జరిగాయి. మనదేశంలో మాదిరిగానే మాడగాస్కర్ ప్రజలు వరి అన్నం తింటారు. అయితే వరసగా విరుచుకుపడుతున్న విపత్తులు వలన వ్యవసాయం అట్టడుగుకు చేరిపోయింది. సహజవనరులు తక్కువగా ఉండటం, మార్కెట్ పెద్దగా లేకపోవటంతో వ్యవసాయం దిగుబడి మరింతగా పడిపోయింది.

eating mud mixed with tamarind to satisfy hunger shocking facts
ఒకప్పుడు అభివృద్ధిలో దూసుకుపోయిన మాడగాస్కర్, ఇప్పుడు ఆకలి చావులతో అల్లాడిపోవటానికి ప్రధాన కారణం రాజకీయ సంక్షోభం అనే చెప్పాలి. 2009 నుండి 2013 మధ్యలో సంభవించిన రాజకీయం విభేదాలు మూలంగా దేశం ఆర్థిక సమస్యలో కూరుకుపోయింది. మొదటి నుండి మెడగాస్కర్ కు టూరిజం అనేది ప్రధాన సహజ వనరు. అలాంటి టూరిజం దెబ్బ తినటంతో ఆ దేశం బీదరికంలోకి నెట్టవేయబడింది. దీనితో ఇతర దేశాలు ఇచ్చే ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తూ ముందుకు వెళ్లాల్సిన దుస్థితికి వచ్చింది.
రాజకీయం నేతలకు సరైన ముందుచూపు లేకపోవటం వలనే ఇప్పుడు ఆ దేశంలో ఇలాంటి పరిస్థితికి కారణం. ముఖ్యంగా సౌత్ మాడగాస్కర్ లో గత 10 నెలల నుండి ఒక్క వర్షపు చినుకు కూడా పడలేదు. దీనితో అక్కడ ప్లాంటేషన్ పూర్తిగా ఆగిపోయింది. పంట పొలాలు బీటలు వారి నోళ్లు తెరుచుకున్నాయి. పెద్దలకే ఆహారం దొరకని స్థితిలో ఇక పసిపిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. సరైన పోషక ఆహారం లేకపోవటంతో పసిమొగ్గలు చిక్కి శల్యమే పోతున్నారు. ఆకలి తట్టుకోలేక మట్టి కలిపిన చింతపండు తినలేక అక్కడి పిల్లలు మృత్యు వాత పడుతున్నారు. మరి ఈ దారుణమైన పరిస్థితుల నుండి మాడగాస్కర్ ఎప్పుడు బయటపడుతుందో ఏమో..