Blood Cancer : బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి..? ఈ లక్షణాలు ఉంటే బ్లడ్ క్యాన్సర్ ఉన్న‌ట్లే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Blood Cancer : బ్లడ్ క్యాన్సర్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి..? ఈ లక్షణాలు ఉంటే బ్లడ్ క్యాన్సర్ ఉన్న‌ట్లే..?

 Authored By jagadesh | The Telugu News | Updated on :23 June 2021,4:04 pm

Blood Cancer : ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య క్యాన్సర్. ఇది పెద్ద సైలెంట్ కిల్లర్. ఎప్పుడు వస్తుందో.. ఎలా వస్తుందో తెలియదు. మనిషినే మింగేస్తుంది. శరీరంలోని అవయవాలను ఒక్కొక్కటిగా దెబ్బ తీస్తుంది ఇది. ప్రస్తుతం ప్రతి పది మందిలో ముగ్గురు నలుగురు క్యాన్సర్ తో బాధపడుతుంటారు. వయసుతో సంబంధం లేకుండా.. క్యాన్సర్ ప్రతి ఒక్కరిని బలి తీసుకుంటోంది. క్యాన్సర్ లో చాలా రకాలు ఉంటాయి. అందులో ప్రధానమైనది బ్లడ్ క్యాన్సర్. ఇది చాలామందికి సోకుతుంది. అయితే.. ఏ క్యాన్సర్ అయినా కూడా ఫస్ట్ స్టేజ్ లోనే గుర్తించగలగాలి. లేదంటే.. చాలా సమస్యలు వస్తాయి. పైనల్ స్టేజ్ లో క్యాన్సర్ ను గుర్తించినా కూడా వేస్టే. అప్పుడు ఎవ్వరూ ఏం చేయలేరు.. ఎన్ని ట్రీట్ మెంట్లు చేసినా బతకడం కష్టం. అందుకే.. క్యాన్సర్ ను ఎంత త్వరగా గుర్తించగలిగితే.. అంత త్వరగా ప్రాణాలను కాపాడుకోవచ్చు.

symptoms of blood cancer and diagnosis treatment

symptoms of blood cancer and diagnosis treatment

అయితే.. క్యాన్సర్ వచ్చిందని చాలామందికి తెలియదు. ఎప్పుడో ఆసుపత్రికి వెళ్లి.. వేరే ట్రీట్ మెంట్ చేస్తుంటే క్యాన్సర్ బయటపడుతుంది. అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోతుంది. ఫైనల్ స్టేజ్ లోకి వెళ్లిపోతుంది. అందుకే.. ముందే క్యాన్సర్ ను గుర్తించగలగాలి. అప్పుడే క్యాన్సర్ ను త్వరగా జయించవచ్చు.

Blood Cancer : క్యాన్సర్ ను ముందే గుర్తించడం ఎలా?

symptoms of blood cancer and diagnosis treatment

symptoms of blood cancer and diagnosis treatment

మనిషి ఒక్కసారిగా బలహీనంగా మారిపోవడం.. అలసట ఎక్కువ అవడం, అనారోగ్యానికి తరుచుగా గురి కావడం, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, శ్వాస సమస్యలు రావడం, ఎముకలలో పగుళ్లు ఏర్పడటం, చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం, అధికంగా చెమట రావడం, ఊరికే బరువు కోల్పోవడం, వికారం, కడుపు నొప్పి, ఎముకల నొప్పి, ముక్కు నుంచి రక్తం రావడం, చిగుళ్ల నుంచి రక్తం రావడం, మూత్ర సమస్యలు వస్తే క్యాన్సర్ వచ్చినట్టే లెక్క. వెంటనే ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోవాలి.

Blood Cancer : బ్లడ్ క్యాన్సర్ లోని రకాలు ఇవే

symptoms of blood cancer and diagnosis treatment

symptoms of blood cancer and diagnosis treatment

బ్లడ్ క్యాన్సర్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. బ్లడ్ క్యాన్సర్ వస్తే.. రక్త కణాల పనితీరు మారుతుంది. రక్త కణాలు ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. బ్లడ్ క్యాన్సర్ లో రకరకాల క్యాన్సర్లు ఉంటాయి. లుకేమియా, లింఫోమా, మైలోమా బ్లడ్ క్యాన్సర్ రకాలు. రక్త కణాల ఉత్పత్తి ఎక్కువైనా కూడా బ్లడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే బ్లడ్ క్యాన్సర్ ను ఎంత త్వరగా గుర్తించగలిగితే.. అంత త్వరగా ప్రాణాలను కాపాడుకోవచ్చు.

ఇది కూడా చ‌ద‌వండి ==> Mind Diet : శరీరంలో వంద రోగాలు ఉన్నా.. ఒక్కటే డైట్.. ఇది పాటిస్తే చాలు.. రోగాలన్నీ మటాష్..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Mobile : నిద్ర లేవ‌గానే మీరు వెంట‌నే మొబైల్ చూస్తున్నారా.. అయితే మీకు ఈ జ‌బ్బు ఉన్న‌ట్లే..?

ఇది కూడా చ‌ద‌వండి ==> Belly Fat : బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా? ఇలా చేస్తే మీ బొడ్డు నాజూగ్గా మారడం ఖాయం..!

ఇది కూడా చ‌ద‌వండి ==> Turmeric Green Tea : పసుపు గ్రీన్ టీని నిత్యం తీసుకుంటే శరీరంలో జరిగే మార్పులు తెలిస్తే అస్సలు వదలరు..!

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది