ys jagan : నీ సొంతోళ్లే నిన్ను ఇలా అంటున్నారు జగనన్న.. మారకపోతే చాలా కష్టం ?
ys jagan :ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ys jagan 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంను దక్కించుకన్న విషయం తెల్సిందే. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు మరియు చేసిన అభివృద్ది చాలానే ఉంది. కాని వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచి సీఎం అవ్వాలంటే మాత్రం ఈమాత్రం సరిపోదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఎమ్మెల్యేల నుండి సర్పంచ్ ల వరకు వైకాపాకు చెందిన వారు అనధికారికంగా మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ys jagan క్షేత్ర స్థాయిలో పార్టీ నాయకులతో మరియు ప్రజలతో మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు. ఇప్పటి వరకు ఆయన క్షేత్ర స్థాయిలో పర్యటించిన దాఖలాలు లేవు. దాంతో సీఎంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల్లోకి వెళ్లకుంటే ఎలా జగన్.. ys jagan
మంత్రులు మరియు ఎమ్మెల్యేలను ఎప్పుడు కూడా జనంలో ఉండమంటూ ఆదేశిస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ys jagan ఎందుకు తాను జనంలో ఉండేందుకు ఇష్టపడటం లేదు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. సీఎం అయినంత మాత్రాన క్షేత్ర స్థాయిలో పర్యటించకూడదు అంటూ ఏమైనా రాసి పెట్టి ఉందా అంటూ కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్ కు ప్రజల్లోకి వెళ్లేందుకు తీరిక లేకుండా ఉందాం అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ప్రజల్లోకి వెళ్లకుంటే మాత్రం ముందు ముందు జగన్ ys jagan ను వారు పట్టించుకునే అవకాశం లేదు అంటూ రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
కక్ష సాధింపులు వద్దు..
క్షేత్ర స్థాయిలో వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు తమ పాత కక్షలను తీర్చుకునేందుకు సిద్దం అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా అధికారం ఉంది కదా అంటూ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ కారణం వల్ల కూడా జగన్ ను క్షేత్ర స్థాయిలో పర్యటించి మా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని సొంత పార్టీ వాళ్లే క్షేత స్థాయిలో పర్యటించడం లేదంటూ చెప్పడంతో ఇకపై మారక పోతే మాత్రం జగన్ కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
ఇది కూడా చదవండి == > ఆ ఎమ్మెల్యేకి మంత్రి పదవి గ్యారెంటీ ? ఆ విషయంలో జగన్ ఫుల్ గా ఇంప్రెస్ అయ్యాడు మరి ?
ఇది కూడా చదవండి == > KCR : ఆనాడు వైఎస్సార్ చెప్పిందే నేడు జరిగింది.. తెలంగాణ వస్తే ఏమౌతుందో ముందే ఊహించిన వైఎస్సార్?