New Ration Card : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు
New Ration Card : తెలంగాణ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం తాజాగా క్లారిటీ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. అప్పుడెప్పుడో కొత్త రేషన్ కార్డులను ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ కొత్త రేషన్ కార్డే ఇవ్వలేదు. అందుకే రాష్ట్ర ప్రజల కోసం కొత్త రేషన్ కార్డు ప్రక్రియను ప్రారంభించినట్టు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
కొత్త రేషన్ కార్డులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు 21 నుంచి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే.. కొత్త రేషన్ కార్డుతో పాటు ఇప్పటికే రేషన్ కార్డు ఉన్నవాళ్లు అందులో ఏవైనా తప్పులు ఉంటే సరిచేసుకోవచ్చని తెలిపింది. కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వాళ్లు ఆధార్ కార్డు, ఫోటో, ఇన్ కమ్ సర్టిఫికెట్, అడ్రస్ ప్రూఫ్ లాంటి వివరాలు ఇచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారులు అన్ని వివరాలు వెరిఫై చేసుకొని దరఖాస్తును ఓకే చేస్తారు.
New Ration Card : రేషన్ కార్డు ఉంటే ఉచితంగా రేషన్ సరుకులు
ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్నవారికి పుడ్ అండ్ సివిల్ సప్లయి శాఖ నుంచి ఉచితంగా బియ్యాన్ని అందిస్తున్నారు. ఇదివరకు కిలో బియ్యం రూపాయికి ఇచ్చేవారు కానీ.. ఇప్పుడు ఆ రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా బియ్యాన్ని అందిస్తున్నారు. ఒక్క వ్యక్తికి ఆరు కిలోల చొప్పున ఆ రేషన్ కార్డులో ఎంత మంది పేర్లు ఉంటే అంతమందికి రేషన్ బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. అలాగే.. రేషన్ కార్డు ఉన్నవాళ్లకు పలు ప్రభుత్వ పథకాలు అమలు అవుతుంటాయి. రేషన్ కార్డు ఉన్నవాళ్లకే పలు స్కీమ్స్ ను ప్రభుత్వం ప్రవేశపెడుతూ ఉంటుంది. ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ కావాలన్నా రేషన్ కార్డు ఉండాలి. అందుకే చాలామంది రేషన్ కార్డు కోసం చాలా తిప్పలు పడుతుంటారు. చాలా పైరవీలు చేసి మరీ రేషన్ కార్డును తీసుకుంటూ ఉంటారు.