Paritala sunitha : తల్లి పరిటాల సునీత ఓకే. మరి, కొడుకు శ్రీరామ్ సంగతి?.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Paritala sunitha : తల్లి పరిటాల సునీత ఓకే. మరి, కొడుకు శ్రీరామ్ సంగతి?..

Paritala sunitha : 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ఫ్యాన్ గాలి వీయటంతో రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్లీ చప్పుడు చేయట్లేదు. కానీ ఆ జిల్లాలోని రాప్తాడు శాసన సభ నియోజకవర్గంలో మాత్రం పరిటాల ఫ్యామిలీ మరోసారి చాప కింద నీరు లాగా పని చేసుకుంటూ పోతోంది. ఈ సెగ్మెంట్ లో వరుసగా రెండు సార్లు విజయం సాధించిన పరిటాల సునీత మూడోసారి […]

 Authored By kondalrao | The Telugu News | Updated on :17 June 2021,7:58 pm

Paritala sunitha : 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ఫ్యాన్ గాలి వీయటంతో రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్లీ చప్పుడు చేయట్లేదు. కానీ ఆ జిల్లాలోని రాప్తాడు శాసన సభ నియోజకవర్గంలో మాత్రం పరిటాల ఫ్యామిలీ మరోసారి చాప కింద నీరు లాగా పని చేసుకుంటూ పోతోంది. ఈ సెగ్మెంట్ లో వరుసగా రెండు సార్లు విజయం సాధించిన పరిటాల సునీత మూడోసారి (2019లో) తాను బరిలోకి దిగకుండా తన కుమారుడు పరిటాల శ్రీరామ్ ని నిలబెట్టారు. అయితే ఆ ప్లాన్ వర్కౌట్ కాకపోవటంతో మళ్లీ పరిటాల సునీతే రంగంలోకి దిగుతున్నారు.

ఇప్పటినుంచే..

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. అయినా పరిటాల సునీత ముందుజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కష్టపడుతున్నారు. కేడర్ తో రెగ్యులర్ గా మీటింగులు పెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలను తూచా తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా ఆ ఇంటి ఆడపడుచులాగా పరిటాల సునీత హాజరవుతున్నారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై పదునైన విమర్శలు చేస్తున్నారు. అతని అవినీతిని ఎండగడుతున్నారు. తల్లీ కొడుకు ఇద్దరూ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మేమున్నాం అంటూ కార్యకర్తలకు ధైర్యం చెబుతున్నారు. వీటికితోడు వైఎస్సార్సీపీ సర్కారు పరిటాల శ్రీరామ్ పై పెడుతున్న కేసులు కూడా టీడీపీకి పొలిటికల్ గా కలిసొస్తాయనే అంచనా ఉంది.

paritala sunitha again active Politics

paritala sunitha again active Politics

తల్లి పరిటాల సునీత  పట్టు నిలుపుకోవాలని.. : Paritala sunitha

రాప్తాడు నియోజకవర్గానికి పరిటాల సునీత వరుసగా పదేళ్లు ఎమ్మెల్యేగా చేశారు. రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలను నిర్వర్తించారు. దీంతో రాప్తాడు నియోజకవర్గంపై ఆ కుటుంబానికి బాగా పట్టుంది. మొన్నటి ఎలక్షన్ లో కూడా పరిటాల సునీతే పోటీ చేసుంటే పరిస్థితి వేరేలా ఉండేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జరిగిందేదో జరిగిపోయింది. ఇకపై ప్రయోగాలు చేయొద్దని తీర్మానించుకున్నారు. తద్వారా పరాజయం పాలవకుండా ఉండాలని పట్టుదల ప్రదర్శిస్తున్నారు. మెజారిటీ సంఖ్యలో ఉన్న పరిటాల రవి అభిమానుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. పరిటాల సునీతపై ప్రజల్లో సానుభూతి ఉందని, ఆమె అయితే తప్పకుండా నెగ్గుతారని పార్టీ అధినేత చంద్రబాబు కూడా భావిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది. మరి యువకెరటం పరిటాల శ్రీరామ్ పరిస్థితేంటో తెలియట్లేదు.

ఇది కూడా చ‌ద‌వండి==> Raghu Ramakrishna Raju : కేంద్ర మంత్రిగా రఘురామనా…?

ఇది కూడా చ‌ద‌వండి==> Akhila Priya : మేనమామ ద్వారా మంతనాలు వైసీపీలోకి..!

ఇది కూడా చ‌ద‌వండి==> Nimmagadda : నిమ్మగడ్డా.. నిన్ను వదల..

ఇది కూడా చ‌ద‌వండి==> Chandra Babu : ఆ పోస్టు కోసం.. చంద్రబాబు వెతుకుతున్న వ్యక్తి ఎవరో?..

kondalrao

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది