2024 కోసం.. 2023లో పొలిటికల్ పంచ్ ఇవ్వబోతున్న పవన్..!
Pawan kalyan ‘లాస్ట్ పంచ్ మనదైతే.. ఆ కిక్కే వేరప్పా..’ అని పవన్ కల్యాణ్ సూపర్ హిట్ మూవీ అత్తారింటికి దారేదిలోని సూపర్ హిట్ డైలాగ్. సినిమాల్లో పంచ్ వేసి అదరగొట్టేసిన పవన్ రాజకీయాల్లో కూడా అదే స్ట్రాటజీని ఫాలో కావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు కారణం ప్రస్తుత రాజకీయా సినారియోనే. 2024 ఎన్నికలే లక్ష్యంగా పవన్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ గ్యాప్ లో వరుసగా సినిమాలు చేస్తున్న సంగతీ తెలిసిందే. 2019 ఎన్నికల ముందు పవన్ అజ్ఞాతవాసి అనే ఫ్లాప్ తర్వాత ఎంట్రీ ఇచ్చారు. ఇవేమీ పవన్ క్రేజ్ కు మ్యాచ్ కాకపోయినా ఈసారి ఎన్నికల సెంటిమెంట్ ఫాలో అవుతారని అంటున్నారు.
2024 ఎన్నికలకు సిద్ధం : పవన్ కల్యాణ్
అందుకే వరుసగా సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుని 2023లోగా పూర్తి చేసి 2024 ఎన్నికలకు సిద్ధం కావాలని ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆర్ధికంగా కూడా ఎన్నికలకు హెల్ప్ అవుతుందనేది ఓ ఆలోచన. ఇది కాకుండా పవన్ కు సొంతంగా ఎదగాలని ఉన్నా ఎక్కడా కలిసి రావట్లేదు. సభలు, రోడ్ షోలకు వచ్చిన జనం ఓట్లు వేయడం లేదు. అందుకే ఇప్పటివరకూ అనేక పార్టీలతో పొత్తులు నెరిపిన పవన్ ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు. అయితే.. బీజేపీతో ఆయనకు పొసగడం లేదని ఓ వార్త రౌండ్ అవుతోంది. బహిరంగంగానే బీజేపీపై అసహనం వ్యక్తం చేయగా.. బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగి పరిస్థితులను చక్కబెట్టేసింది.
అయినా.. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం పది శాతం కూడా రాలేదు. దీంతో ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పేసి టీడీపీతో జత కట్టాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇప్పుడే కటీఫ్ చెప్పేసి టీడీపీకి జై కొడితే జనం నమ్మరనే ఉద్దేశంతో మరో రెండేళ్లు ఇదే పద్ధతిలో ఉండి.. జగన్ ఓడించే లక్ష్యంతో కాస్త ఓట్ బ్యాంక్ ఉన్న టీడీపీతో జత కడుతున్నాను అని చెప్పి 2014 మ్యాజిక్ రిపీట్ చేయాలనే తలంపుతో పవన్ ఉన్నట్టు చెప్తున్నారు. మరి ఇదే నిజమైతే.. పవన్ మళ్లీ టీడీపీకి సపోర్ట్ చేసి తాను లాభపడేది ఏంటో ఆయనకే తెలియాలి. చంద్రబాబుకు మద్దతిస్తే తర్వాతి పరిణామాలు ఏంటో పవన్ కు బాగా తెలుసు. మరి పవన్ నిర్ణయమేంటో చూడాలి.