Gangavva : పాదయాత్రలో రేవంత్ రెడ్డికి ఇష్టమైన వంటకం చేసి తీసుకొచ్చిన గంగవ్వ.. వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gangavva : పాదయాత్రలో రేవంత్ రెడ్డికి ఇష్టమైన వంటకం చేసి తీసుకొచ్చిన గంగవ్వ.. వీడియో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :8 March 2023,12:00 pm

Gangavva : తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర కీలకంగా మారింది. పాదయాత్ర ప్రారంభమై దాదాపు 20 రోజులకు పైగానే కాగా… ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పోటీపడిన గంగవ్వ రేవంత్ రెడ్డిని పాదయాత్రలో కలిసింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కోసం స్వయంగా

PCC Revanth Reddy Meets Gangavva

PCC Revanth Reddy Meets Gangavva

తన ఇంటి దగ్గర ఉండి చేసిన పచ్చిమిర్చి బజ్జిలను తీసుకొచ్చింది. రేవంత్ రెడ్డి వాటిని తీసుకుని అందరికీ పంచిపెట్టి తనకెంతో ఇష్టమైన బజ్జీలని తెలియజేశారు. అంతేకాదు గంగవ్వని చూస్తుంటే తన తల్లి గుర్తుకొస్తుందని కాసేపు… ఆమెతో కూర్చుని మాట్లాడటం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గంగవ్వతో కూర్చున్న సందర్భాన్ని… ట్విట్టర్ ద్వారా రేవంత్ రెడ్డి తెలియజేశారు. “గంగవ్వ…

రేవంత్ రెడ్డి కోసం మిర్చీలు చేసుకోచ్చిన గంగవ్వ ????| Revanth Reddy With  Gangavva | Legend Tv - YouTube

తెలంగాణకు పరిచయం అక్కర్లేని అవ్వ. ప్రపంచానికి తనొక సెలబ్రిటీ. నాకు మాత్రం ప్రేమను పంచిన అమ్మ. నాకోసం ఆప్యాయంగా, నాకు ఇష్టమైన మిర్చి బజ్జీ తీసుకువచ్చి, తను చూపించిన ప్రేమ నా కన్నతల్లిని గుర్తుకు తెచ్చింది. యాత్రలో జనం కష్టాలు, బాధలు నేరుగా చూస్తున్నా. నా అనుభవాలను నా తల్లితో ఇలాగే ముచ్చటించేవాడిని. తల్లిని గుర్తుచేసిన గంగవ్వను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను” అంటూ భావోద్వేగభరితంగా స్పందించారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది