Pension Scheme : బిజినెస్, ప్రైవేట్ జాబ్ చేసేవారు 50 వేల పెన్షన్ పొందండి ఇలా… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pension Scheme : బిజినెస్, ప్రైవేట్ జాబ్ చేసేవారు 50 వేల పెన్షన్ పొందండి ఇలా…

 Authored By aruna | The Telugu News | Updated on :27 August 2022,10:00 pm

Pension Scheme : గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్లకు కచ్చితంగా పెన్షన్ వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత వాళ్లకు ఆర్థికంగా ఏదో ఒక భరోసా ఉంటుంది. కానీ ప్రైవేట్ ఉద్యోగులకు మాత్రం అలా కాదు. పనిచేయడం ఆగితే నెలనెలా వచ్చే జీతం ఆగుతుంది. అలాగని ఖర్చులు మాత్రం ఆగవు. అయితే ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారు, సొంత వ్యాపారం చేసే వారికి కూడా నెల నెల పెన్షన్ పొందే వీలు కల్పిస్తుంది నేషనల్ పెన్షన్ సిస్టం. దీని ద్వారా రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల 50 వేలు వచ్చేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఎన్ పిఎస్ అనేది కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ. కావున ఇందులో పెట్టిన పెట్టుబడికి ఎలాంటి దోక ఉండదు.

పిఎఫ్,ఆర్ డిఎ, కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ పొదుపు పథకాన్ని నిర్వహిస్తున్నాయి. రిటైర్మెంట్ కోసం ముందు నుంచే దాచుకునే సౌకర్యాన్ని కల్పించడానికి ఏర్పాటయిందే ఈ ఎన్ పిఎస్. ఇందులో ఎవరైనా పెట్టుబడి పెట్టి రిటైర్మెంట్ తర్వాత నెల నెల కొంత మొత్తాలని ఇక్కడ తీసుకోవచ్చు. ఒక వ్యక్తి వయసు ఇప్పుడు 30 ఏళ్లు అయితే నెలనెలా ఎన్పీఎస్ కు 5000 జమ చేస్తున్నాడు. 60 ఏళ్ళు వచ్చేదాకా పెట్టుబడి పెట్టడానికి సిద్ధం. అంటే 35 ఏళ్లు పెట్టుబడి పెడతాడు అన్నమాట.

Pension Scheme get 50000 per monthly

Pension Scheme get 50,000 per monthly

ఇక ఈ పెట్టుబడిలపై కనీసం ఏటా పది శాతం రాబడి వస్తుందని ఆ వ్యక్తి ఆశిస్తున్నాడు. తనకు 65 ఏళ్లు వచ్చేసరికి తాను పెట్టుబడి పెట్టిన మొత్తం 27.30 లక్షలు. కానీ లాభంతో 2.48 కోట్లు అవుతుంది. అయితే ఈ మొత్తం తీసుకోవడానికి అవకాశం ఉండదు. 40% యన్యుటిని కొనుగోలు చేసి దానిపై కనీసం ఏడు శాతం ఆదాయాన్ని ఆశించవచ్చు. 58 వేల పెన్షన్ అందుతుంది. అంతేకాదు 99.53 మొత్తం వస్తుంది. తక్కువ వయసులో ఎన్పీఎస్ లో పెట్టుబడి పెడితే చాలాకాలం చెల్లిస్తూ పోవాలి. సెక్షన్ 80సి, 80ccd (1), (2) కింద గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు పొందవచ్చు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది