PM Modi : మహబూబ్ నగర్ ఎంపీగా ప్రదాని నరేంద్ర మోదీ పోటీ? తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమేనా?
PM Modi : తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఎందుకంటే.. తెలంగాణను పాలిస్తున్న బీఆర్ఎస్ పార్టీ దేశమంతా పార్టీని విస్తరించింది. కానీ.. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ పార్టీ ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణ నుంచి పోటీ చేయాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దానికి మహబూబ్ నగర్ అయితే బెటర్ అని మోదీ భావిస్తున్నారట. మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని మోదీ భావిస్తున్నారట.
అసలు సౌత్ లోనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న బీజేపీ.. ఏపీతో పాటు తెలంగాణ మీద కూడా ఫోకస్ పెట్టింది. తమిళనాడు, కేరళలోనూ ఫోకస్ పెంచింది. అయితే.. ముందు తెలంగాణలో ఫోకస్ చేసి.. ఇక్కడ పోటీ చేసి గెలిచి ఆ తర్వాత మిగితా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో తెలంగాణకు సంబంధించిన సీక్రెట్ సర్వే జరిగిందట.
PM Modi : కేంద్ర హోం మంత్రి నేతృత్వంలో సీక్రెట్ సర్వే
ఆ సర్వేలో సానుకూల అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయట. కర్ణాటక తప్పించి సౌత్ లో మరెక్కడా బీజేపీ అధికారంలో లేదు. అంతగా బలంగా కూడా లేదు. కానీ.. కాస్తో కూస్తో తెలంగాణలోనే బీజేపీ బలంగా ఉంది. అందుకే ముందు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. అందుకే.. ఏకంగా ప్రధాని మోదీనే మహబూబ్ నగర్ నుంచి దించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.