Police : మ‌ద్యం మ‌త్తులో పిచ్చి పిచ్చిగా కొట్టుకున్న పోలీసులు.. వైర‌ల్ అవుతున్న వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Police : మ‌ద్యం మ‌త్తులో పిచ్చి పిచ్చిగా కొట్టుకున్న పోలీసులు.. వైర‌ల్ అవుతున్న వీడియో

 Authored By sandeep | The Telugu News | Updated on :8 September 2022,7:00 am

Police : తాగి వీరంగం సృష్టించ‌డం ఈ మ‌ధ్య కాలంలో అంద‌రికి కామ‌న్ అయింది. మాములు వ్య‌క్తులు కొట్టుకుంటే పోలీసులు వారిని దండించో శిక్షించో మంచి చెడులు చెబుతారు. అలాంటిది పోలీసులే తాగి వీరంగం సృష్టిస్తే ఏం చేయాలి. గ‌తంలో ఇలాంటి డిష్యూం డిష్యూంలు చాలానే జ‌ర‌గ‌గా, తాజాగా పీక‌ల‌దాకా తాగిన పోలీసులు స‌భ్య‌స‌మాజం అసహ్యించుకునేలా చేశారు పట్టపగలే నడిరోడ్డుపై పెట్రోలింగ్ జీప్ ఆపి మరీ ఒకరినొకరు తన్నుకున్నారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే.. విధి నిర్వహణలో ఉన్న ఆ ఇద్దరూ ఆ సమయంలో తాగిన మైకంలో ఉన్నట్టు తెలుస్తోంది.

Police : డిష్యూం డిష్యూం..

ఉత్తర్ ప్రదేశ్‌లోని జలాన్‌లో గత వారం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిలో కానిస్టేబుల్ ధరమ్‌వీర్‌కి, హోమ్ గార్డు సునీల్ కుమార్‌కి మధ్య ఏదో విషయంలో వివాదం తలెత్తింది. ఆ వివాదం కాస్తా… చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో నడిరోడ్డుపైనే పెట్రోలింగ్ వాహనం నిలిపిన సిబ్బంది అందులోంచి దిగి బయటికొచ్చి ముష్టి యుద్ధం చేయడం ప్రారంభించారు. ” తూ కిత్తారే.. అంటే తూ కిత్తారే ” అని బూతులు తిట్టుకుంటూ తన్నుకోవడం మొదలుపెట్టారు. అయితే, ఇందులో కానిస్టేబుల్ ధరమ్‌వీర్ అత్యుత్సాహమే కాస్త ఎక్కువున్నట్టు తెలుస్తోంది.

Police fighting with each other on road

Police fighting with each other on road

జలాన్ జిల్లా రాంపుర పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘ‌న‌ట‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. వీడియో వైరల్ అవడంతో పోలీసుల ముష్టి యుద్ధం వివాదం కాస్తా జిల్లా ఎస్పీతో పాటు యూపీ పోలీసు బాస్ వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. వీరి ఘటనపై డిపార్ట్ మెంటల్ ఎంక్వరీ కూడా వేయాలని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వీరు కొట్టుకున్న వీడియో నెట్టింట్లో కాస్త వైరల్ గా మార‌డంతో సామాన్య ప్ర‌జ‌లు సైతం వారి ప్ర‌వ‌ర్త‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది