వైఎస్ షర్మిల ఎఫెక్ట్.. ఈ టీఆర్ఎస్ నేతకు మంత్రి పదవి..?
ponguleti Srinivas : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పుడు పెద్ద లీడర్లు ఎవరంటే ఇద్దరు ఉన్నారు. ఒకరు.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రెండోవారు.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. వీళ్లు ఇద్దరూ ఇద్దరే. వీళ్లిద్దరిలో తుమ్మల నాగేశ్వరరావే రాజకీయాల్లో సీనియర్. అయినప్పటికీ గత పదేళ్లుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డ పేరు కూడా వినిపిస్తోంది. 2018లో జరిగిన ముందస్తు శాసన సభ ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అసలు బరిలో నిలిచే ఛాన్సే రాలేదు. ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన నామా నాగేశ్వర రావుకి టికెట్ ఇవ్వటంతో పొంగులేటికి మొండి చెయ్యి ఎదురైంది.
ponguleti Srinivas రాజ్యసభకూ మిస్..
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రాజ్యసభకు పంపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో కె.కేశవరావుకు అవకాశం ఇవ్వటంతో పొంగులేటికి మరోసారి నిరాశ తప్పలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ శాసన మండలిలో శాసన సభ్యుల కోటాలో ఆరు, గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయింది. దీంతో ఈ ఇద్దరిలో ఎవరికి పదవీ యోగం పట్టనుందో అనే చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరికీ న్యాయం చేయాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకుంటే అప్పుడు ఒకే జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుంది.పొంగులేటికి మంత్రి పదవి రాకపోతే వైఎస్ షర్మిల పార్టీలోకి వెళ్లె చాన్స్ ఉంటుంది. పొంగులేటి శ్రీనివాస్ అంతకు ముందు వైసీపీ పార్టీ నుంచి టీఆర్ ఎస్‌లో వచ్చిన వాడే. అందుకే పొంగులేటికి మంత్రి పదవి ఇవ్వకపోతే వైఎస్ షర్మిల పార్టీ ఖమ్మంలో పుంజుకునే అవకాశం ఉంటుందేమో అని కేసీఆర్ భావిస్తున్నారు. అది ఇతర జిల్లాలపై ప్రభావం చూపుతుంది.
తుమ్మలకు గతంలోనే..: Tummala Vs Ponguleti
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఎస్సార్సీపీ నుంచి, తుమ్మల నాగేశ్వర రావు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చారు. తుమ్మల తన పార్టీలో చేరినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవితోపాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా ఛాన్స్ ఇచ్చి గౌరవించారు. కానీ పొంగులేటికే ఇంతవరకూ ఒక్క ఫేవర్ కూడా చేయలేకపోయారు. దీంతో ఇప్పుడు పొంగులేటికే ప్రాధాన్యత ఇవ్వనున్నారని చెబుతున్నారు. టీఆర్ఎస్ లోకి తుమ్మల కన్నా పొంగులేటే ముందొచ్చారు కూడా. కానీ 2018 ఎన్నికల్లో గ్రూపు రాజకీయాలు చేశారనే ఆరోపణలతో పార్టీ అధిష్టానం ఈయన్ని పక్కన పెట్టింది.
కేటీఆర్ వైపు ఎవరు?..
ఈ ఇద్దరిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని యువనేత కేటీఆర్ వర్గంగా చెబుతారు. తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి కేసీఆర్ కి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి సహచరుడు. సీఎం కేసీఆర్, తుమ్మల దాదాపు ఒకే వయసు వాళ్లు. కాబట్టి తుమ్మలకు కేటీఆర్ తో అంతగా ర్యాపో లేదని చెప్పొచ్చు. టీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా కేటీఆర్ కే వదిలేయలేదు కాబట్టి తమ్మలకి కూడా పదవి దక్కొచ్చని చెబుతున్నారు. ఎమ్మెల్సీ పోస్టుతోపాటు మంత్రి పదవి కూడా ఇవ్వాలని వీళ్లద్దరు కోరుతుండటం గమనార్హం. అయితే ఆ ఛాన్స్ ఒక్కరికే అని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.