PMAY-U : సొంతింటి కల వారికీ కేంద్రం గుడ్ న్యూస్..!
ప్రధానాంశాలు:
PMAY-U : సొంతింటి కల వారికీ కేంద్రం గుడ్ న్యూస్..!
PMAY-U : సొంతింటి కలను నెరవేర్చుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (PMAY-U) పథకం గడువును 2025 డిసెంబర్ 30 వరకు పొడిగించింది. 2022 మార్చి 31 నాటికి మంజూరైన ఇళ్ల నిర్మాణాలు పూర్తికాలేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నది. దీని వల్ల లక్షలాది మంది లబ్ధిదారులకు త్వరలోనే పక్కా సొంత ఇల్లు కలగనుంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు ఇది గొప్ప అవకాశం.

PMAY-U : సొంతింటి కల వారికీ కేంద్రం గుడ్ న్యూస్..!
PMAY-U : ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ ( PMAY-U ) పథకం గడువు పొడగింపు
PMAY-U 2.0 పథకం ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే EWS, LIG, MIG వర్గాల కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. సొంత ఇల్లు లేని వారు కేంద్ర ప్రభుత్వం సహాయంతో ఇల్లు నిర్మించుకునేందుకు, కొనుగోలు చేసేందుకు లేదా అద్దెకు తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. ఈ పథకంలో లబ్ధిదారుల నేతృత్వంలోని నిర్మాణం (BLC), భాగస్వామ్య గృహ నిర్మాణం (AHP), సరసమైన అద్దె గృహం (ARH), వడ్డీ రాయితీ పథకం (ISS) అనే నాలుగు విభాగాల ద్వారా ప్రజలకు మద్దతు లభిస్తుంది.
ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే pmaymis.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి, ఆధార్ ధృవీకరణతోపాటు వ్యక్తిగత, ఆర్థిక వివరాలు నమోదు చేయాలి. అలాగే అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి దరఖాస్తు సమర్పించాలి. అవసరమైతే కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా కూడా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. ఆధార్ కార్డు, కుటుంబ వివరాలు, బ్యాంక్ ఖాతా సమాచారం, భూమి పత్రాలు వంటి డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచితే, ఈ పథకం ద్వారా సొంతింటి కల సాకారం చేసుకునే అవకాశం లభిస్తుంది.