Farmers : రైతులకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం…దరఖాస్తు చేసుకోండిలా…!
ప్రధానాంశాలు:
Farmers : రైతులకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం...దరఖాస్తు చేసుకోండిలా...!
Farmers : కేంద్ర ప్రభుత్వం అనేక రకాల పథకాల ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చే దిశగా కృషి చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకం అమలులోకి తీసుకువచ్చింది. అయితే కృషి సించాయి యోజన అనే పథకం ద్వారా వ్యవసాయ సంబంధిత సౌకర్యాలను అందించడానికి తాజాగా కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించడం జరిగింది. మరి ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను ఎలా పొందాలి..?అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అయితే ఈ పథకం ద్వారా రైతులు అందరికీ సరైన సమయంలో వ్యవసాయానికి కావాల్సిన సరైన సౌకర్యాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇక ఈ ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద 2024 25 సంవత్సరానికి సుమారు 50% మంది రైతులకు ఈ పథకం ద్వారా సబ్సిడీని అందిస్తుంది. అదేవిధంగా బావుల నిర్మాణానికి కావాల్సిన సౌకర్యాలు కూడా కల్పిస్తుంది. అంతేకాక ఇప్పటికే నిర్మించి ఉన్న వ్యవసాయ బావుల్లో ఎంత నీటి ప్రవాహం ఉంది ఎంత మేరకు మెరుగైన వ్యవసాయం చేయవచ్చు. ఎలాంటి కొత్త సాంకేతికలు అవలంబించవచ్చు అనే పూర్తి సమాచారాలు ఈ పథకం ద్వారా తెలుసుకోవచ్చు.
అలాగే భూగర్భ జలాల సంరక్షణ మరియు దేశంలో విపరీతంగా మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మెరుగైన వ్యవసాయం మరియు దాని అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా వివిధ రకాల సమాచారాన్ని అందించడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా సౌకర్యాలు పొందేందుకు దరఖాస్తులు కూడా ఆహ్వానించడం జరిగింది కాబట్టి అర్హులైన వారు ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి దానికి కావాల్సిన పత్రాలు ఏంటి అనే పూర్తి వివరాలను మీ గ్రామ ప్రాంతాల్లోని వ్యవసాయ కేంద్రాలలో అడిగి తెలుసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి వెంటనే ఈ పథకానికి సంబంధించిన పూర్తి తెలుసుకుని దరఖాస్తు చేసుకోండి.