Phone : జైల్లో ఫోన్ మింగేసిన ఖైదీ.. ఎలా బయటకు తీశారో తెలుసా..?
Phone : జైల్లో తనిఖీలు నిర్వహిస్తు వేళ, ఓ ఖైదీ మొబైల్‌లో మాట్లాడుతున్న విషయం అధికారుల కంటపడింది. దీంతో సదరు ఖైదీ వద్దకు అధికారులు వెళ్తుండగా, వారి నుంచి తప్పించుకోవడం అసాధ్యమని భావించిన సదరు ఖైదీ, అధికారులకు దొరకకూడదని భావించి ఆ మొబైల్‌ను మింగేశాడు. ఇది గమనించిన జైలు అధికారులు.. అతడిని స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఖైదీకి ఎక్స్ రే పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతడికి ఆపరేషన్ లేకుండానే మొబైల్ ను అతని శరీరం నుంచి బయటకు వచ్చేలా చేస్తామని.. అందుకు ఓ పది రోజులు తమ పర్యవేక్షణలో ఉంచాల్సిందిగా సూచించారు. ఈ ఘటన 10 రోజుల క్రితం ఢిల్లీలోని తిహార్ జైలులో చోటుచేసుకుంది. అయితే సదరు ఖైదీకి ఆపరేషన్ లేకుండానే ఫోన్ ను బయటకు తీయడానికి ప్రయత్నించిన వైద్యులు..
అందులో విజయవంతమయ్యారు. ఈ నెల 15న ఖైదీ శరీరం నుంచి ఆపరేషన్ లేకుండానే చరవానిని బయటకు తీసినట్లు వైద్యులు తెలిపారు. నాలుగు రోజులు ఆసుపత్రిలోనే తమ పర్యవేక్షణలో ఉంచుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సదరు ఖైదీ ఆరోగ్యం బాగానే ఉండటంతో మళ్ళీ అతనిని తిరిగి తీహార్ జైలుకి తరలింపు చేసినట్లు పోలీసులు తెలిపారు.