Andhra Pradesh : పనికిరాని వాహనాల విడిభాగాలతో పెద్ద పెద్ద శిల్పాలను తయారు చేసి శేభాష్ అనిపించుకున్న ఏపీ ప్రొఫెసర్
Andhra Pradesh : ప్రస్తుత జనరేషన్ లో ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ వేస్ట్ ను రీసైకిల్ చేయడం అనేది పెద్ద సమస్యగా మారింది. రోజురోజుకూ పెరుగుతున్న ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలతో పెద్ద సమస్య వచ్చిపడింది. రోజూ కొత్త కొత్త మోడల్స్ వస్తుండటంతో.. పాత వాటికి గిరాకీ తగ్గిపోయి.. వాటిని వేస్ట్ కింద పడేయాల్సి వస్తోంది. అయితే.. ఇప్పుడు ఆ చెత్త పెద్ద సమస్యగా మారింది. ఆ చెత్తను ఏం చేయాలో అర్థం కాక అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ చెత్త వల్ల పర్యావరణానికి హానీ తప్పితే మంచి అయితే లేదు.
అందుకే.. ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడకు చెందిన శ్రీనివాస్ పదకండ్ల అనే ఫ్రొఫెసర్ ఓ గొప్ప ఆలోచన చేశారు. పనికిరాని ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ చెత్తను మనకు అవసరం ఉన్నట్టుగా మార్చుకుంటే.. మనమే రీసైకిల్ చేసుకుంటే బెటర్ కదా అనే ఆలోచన వచ్చింది.
ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ శిల్పాల తయారీ. మీరు ఫోటోలో చూస్తున్న ఈ పెద్ద శిల్పాన్ని తయారు చేసింది కేవలం పనికిరాని చెత్త నుంచి. అవును.. ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ చెత్త నుంచి ఈ శిల్పాన్ని ప్రొఫెసర్ శ్రీనివాస్ తయారు చేశారు.
Andhra Pradesh : వేస్ట్ నుంచి వచ్చిన శిల్పాలను పబ్లిక్ పార్కుల్లో పెడుతున్న ప్రొఫెసర్
ఇలా.. ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ వేస్ట్ నుంచి తయారు చేసే శిల్పాలను పబ్లిక్ పార్కుల్లో సెట్ చేస్తున్నాడు ఈ ఫ్రొఫెసర్. వాటిని పబ్లిక్ పార్కుల్లో సెట్ చేయడంతో పాటు.. ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ వేస్ట్ ను ఎలా రీసైకిల్ చేసుకోవాలో కూడా పది మందికి చెబుతున్నాడు శ్రీనివాస్.
నిజానికి ఆర్ట్ గ్యాలరీస్ అనేవి పెద్ద పెద్ద వాళ్ల కోసం. డబ్బున్న వాళ్ల కోసం స్టార్ హోటళ్లలో ఆర్ట్ గ్యాలరీలను ఏర్పాటు చేస్తారు. కానీ.. పనికిరాని చెత్తను ఉపయోగించి.. మంచి మంచి శిల్పాలు తయారు చేసి.. వాటిని సామాన్యులకు అందుబాటులో ఉండేలా చేస్తే.. అటు పనికిరాని చెత్తను రీసైకిల్ చేసినట్టు ఉంటుంది.. మరోవైపు సామాన్యులకు ఆర్ట్ గ్యాలరీ అందుబాటులో ఉంటుంది.. మరోవైపు అందరికీ.. పనికిరాని చెత్తను ఎలా రీసైకిల్ చేసుకోవచ్చో తెలుస్తుంది. అదే శ్రీనివాస్ ఐడియా కూడా.
సాధారణంగా ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ వేస్ట్ ను చెత్తకుప్పల్లో పడేయడం.. లేదా వాటిని పూడ్చిపెట్టడం లాంటివి చేస్తుంటారు. వాటి వల్ల పర్యావరణానికి హానీ కానీ.. ఉపయోగం లేదు. అందుకే.. ఈ ఆలోచనతో ముందుకెళ్తున్నాడు శ్రీనివాస్.
శ్రీనివాస్ తో పాటు ఆయనకు ఉన్న టీమ్ 15 మంది అందరూ కలిసి ఈ వర్క్ లో పాల్గొంటారు. కాలేజీ స్టూడెంట్స్ కూడా ఆయనకు సాయం చేస్తుంటారు. కొందరు ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ చెత్తను తీసుకురావడం, మరికొందరు శిల్పాల తయారీకి వాటిని సెట్ చేయడం.. ఇలా.. అందరూ కలిసి ఒక వారంలో ఒక శిల్పాన్ని తయారు చేసి.. దాన్ని పబ్లిక్ ప్రాంతాల్లో పెడుతుంటారు.