Latest News : కేరళలో సమాధి పై QR Code… స్కాన్ చేస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే.. వీడియో
Latest News : ప్రస్తుత రోజుల్లో గుండెపోటు మరణాలు ఎక్కువైపోతున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు చాలా వయసు కలిగిన వారు గుండెపోటుకు గురయ్యేవారు. అయితే ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు. ఈ రీతిగానే కేరళ రాష్ట్రంలో 26 సంవత్సరాలు వయసున్న డాక్టర్ ఐవిన్ ఫ్రాన్సిస్ బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుకు గురై చనిపోయాడు. చిన్న వయసులోనే కొడుకు మరణించటంతో తల్లిదండ్రులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఐవిన్ ఫ్రాన్సిస్ చిన్ననాటి నుండి సంగీతం మరియు క్రీడలలో బాగా ప్రావీణ్యత సాధించాడు. అంతేకాదు కీబోర్డ్, గిటార్ ప్రదర్శనలు కూడా ఇవ్వటం జరిగేది.
ఎంతో టాలెంట్ ఉన్న తన కుమారుడు మరణాన్ని తట్టుకోలేకపోయారు తల్లిదండ్రులు. దీంతో ఐవిన్ జీవిత విశేషాలు అతడు సాధించిన పథకాలు మరియు వీడియోలు అందరికీ ప్రేరణగా ఉండాలని అతని పేరిట ఒక వెబ్ సైట్ రూపొందించి క్యూఆర్ కోడ్ తో దాన్ని అనుసంధానం చేశారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఐవిన్ ఫోటోలు… కళాశాలలో కీబోర్డు, గిటార్ లతో ఇచ్చిన ప్రదర్శనలు మిత్రుల వివరాలన్నీ కూడా కనిపిస్తాయి. అంతేకాదు ఐవిన్ బతికున్న సమయంలో వ్యక్తుల ప్రొఫైల్ లను క్యూఆర్ కోడ్ రూపంలో సృష్టించేవాడని దీంతో తన కొడుకు విషయంలో కూడా ఆ రీతిగాని చేయాలని నిర్ణయించుకుని ఈ ఐడియా ఫాలో అయినట్లు ఐవిన్ తండ్రి స్పష్టం చేశారు.
తన కొడుకు గతంలో.. తనకి సమాచారం కోసం చాలా క్యూఆర్ కోడ్ లను పంపడం జరిగింది. అయితే తన కొడుకు సమాధిపై క్యూఆర్ కోడ్ ఐడియా ఐవిన్ సోదరి… ఎవెలిన్ ది. తన సోదరుడు సమాధిపై ఏమీ రాయకుండా దానికి బదులుగా కీ ఆర్ కోడ్ ఉంచమని కోరింది. ఆ రీతిగా క్యూఆర్ కోడ్ పెట్టడంతో పాటు సోదరుడి ప్రతిభ గురించి చెప్పడానికి సరిపోదని… అతని కోసం సపరేటు వెబ్ పేజీ రూపొందించింది. ఈ రీతిగా పది రోజుల్లో సైట్ మరియు క్యూఆర్ కోడ్… ఐవిన్ సోదరి.. తన కుమార్తె సృష్టించింది అని.. ఐవిన్ తండ్రి తెలిపారు. కేరళలోని త్రిస్సూర్ జిల్లా కురియాచిరా పట్టణానికి చెందిన సెయింట్ జోసెఫ్ చర్చి వద్ద ఐవిన్ సమాధి ఉంది. ఈ సమాధి పై పెద్ద సైజులో ఉన్న క్యూఆర్ కోడ్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
