raghu rama krishnam raju : రాజుగారి జైలు గదిలో జరిగిన ఊహించని సన్నివేశం !
raghu rama krishnam raju వైకాపా ఎంపీ రఘురామ కృష్ణం రాజు raghu rama krishnam rajuఅరెస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక ఎంపీని సీఐడీ అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోడీకి సన్నిహితుడిగా పేరున్న రఘురామ కృష్ణం రాజు raghu rama krishnam raju అరెస్ట్ ను బీజేపీ నుండి మొదులకుని జనసేన మరియు తెలుగు దేశం పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఆయన చేసిన తప్పేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. మీడియాలో ఆయన మాట్లాడిన మాటలను ఆధారంగా చేసుకుని కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. మీడియాలో ఆయన ఒక వర్గం వారిని విమర్శిస్తూ వారి మనోభావాలను దెబ్బ తీయడంతో పాటు ప్రభుత్వంను కించ పర్చే విధంగా వ్యాఖ్యలు చేశాడు అనేది ఆరోపణ.
వెనుక ఎవరున్నారు..
రఘురామ కృష్ణం రాజు వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు అంటూ ఇప్పుడు ఎంక్వౌరీ జరుగుతోంది. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తో ఎంపీకి ఏమైనా కనెక్షన్ ఉందా.. బీజేపీ నాయకుల కారణంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేశాడా అనే విషయాన్ని కూడా సీఐడీ ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే టీవీ5 మరియు ఏబీఎన్ ఛానల్స్ రెచ్చగొట్టడం వల్ల తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లుగా ఒప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దాంతో ఆ మీడియా సంస్థలపై కేసు నమోదు చేయడం జరిగింది. ముందు ముందు మరికొందరు ప్రముఖులు కూడా ఈ కేసులో బుక్ అయ్యే అవకాశం ఉంది.
మొబైల్ లో ఏముంది..
రఘురామ కృష్ణం రాజు raghu rama krishnam raju వ్యాఖ్యల వెనుక ఎవరు ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకునేందుకు గాను విచారణ అధికారులు ఆయన మొబైల్ ను స్వాదీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వాట్సప్ మెసేజ్ ల నుండి అన్ని రకాల చాటింగ్ లను మరియు కాల్స్ డేటాను అధికారులు పరిశీలిస్తున్నారు. కాస్త లోతుగా ఎంక్వౌరీ చేస్తే ఖచ్చితంగా అసలు సీక్రెట్ లు బయటకు వస్తాయని వైకాపా నాయకులు అంటున్నారు. ఎంపీ రఘు రామ కృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రెడ్డి సామాజిక వర్గం తీవ్రం అసంతృప్తితో ఉంది. దానికి తోడు వారు ఆయన పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అంటూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు. కనుక ఆయనతో పాటు ఆయన వెనుక ఉన్న వారి గుట్టు రాబట్టేందుకు మొబైల్ ను క్రోడీకరించి అసలు నిజాలు బయటకు తీయబోతున్నారట. ముందు ముందు ఎవరు ఎవరు ఈ కేసులో బుక్ అయ్యేనో చూడాలి.